తన చిన్ని చిన్ని పాదాలతొ నా గుండెను తన్నినా నా చిన్నారి,

నాతొ తొలి ఆడుగులు నడిచినా నా చిన్నారి,

ఆడుకుంటానంటు నా భుజాలెక్కిన నా చిన్నారి,

భయమేస్తే నన్ను హత్తుకునే నా చిన్నారి,

కాలంతొ పాటు తాను పెద్దదయింది,

మనిషే మారుతుందనుకున్నాను,

మనసు కూడా మరిందని తెలుసుకో లేక పొయాను,

ప్రేమించేవాడే ఏక్కువా అని చెప్పి నా గుండెల మీద తన్నింది,

నన్ను వదిలి తనతో ఏడడుగులు నడవటానికి వెళ్ళిపొయింది,

మోసిన భుజాలనే తొక్కి పాతాళంలొకి నెట్టింది,

తానే నా అదౄష్టమనుకున్నా,

ఇప్పుడు ఆ అదృష్టమే నన్ను వాదిలి వెళ్ళిపొతుంది,

అంతేలే ఆడపిల్ల ఏప్పటికైనా ఆడపిల్లే కాని ఈడ పిల్ల కాదుగా.

0 comments:

Post a Comment