నీ మనోసంద్రాన్ని మధిస్తాను నా ప్రేమామృతం కోసం,.

ఎన్నిసార్లైనా నీ తిరస్కార కాలకోటవిషాన్ని భరిస్తాను,

నా ప్రేమమృతం దొరికేదాక

అప్పుడప్పుడు వచ్చే నీ చిరునవ్వులు (కల్పవృక్షంలా) నాకు నమ్మకాన్ని పెంచుతున్నాయి.

నా ఈ మనసుమధనం జరుగుతునే వుంటుంది నీ ప్రేమామృతం దొరికేదాక.

కరుణించవా నీ ప్రేమను ప్రసాదించవా.


ప్రేమాభిమానాలు లేక ఎడారైంది నా గుండె,

అలాంటి నాకు నీ ఎడబాటుతో నా కంటి నుండి నీ కోసం ఒక కన్నీటి చుక్క నేల రాలింది,

అప్పుడు గాని తెలియలేదు నీ ప్రేమ సముద్రం నా గుండెలొ వున్నదని,

నీకోసం జారుతున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు నన్ను ప్రశ్నిస్తున్నాయి,

ఎప్పుడు నిన్ను నేను కలుస్తానని, ఎప్పుడు ఈ ప్రవాహన్ని నీ ప్రేమతో ఆనకట్ట వేస్తానని.

మౌనాన్ని వాటికి సమాధానంగా తెలియజేసాను,

ఎక్కడని వెతకాలి ప్రియతమా నీ జాడకోసం,

నిన్ను నాగుండెలొ దాచుకున్నాననుకున్నాను,

కాని నా గుండెనే చీల్చి నువ్వెళ్ళిపొయావని తెలుసుకోలేకపొయాను,

ఐనా నీ మీద ప్రేమే కాని ద్వేషం లేదు,

నీ ప్రేమప్రాయాణంలో వున్న ఈ బాటసారికి గమ్యం తెలుపలేవా?

కూడు పెట్టని కులమేలా,

మంచి పంచని మతమేల,


కులమంటే :-

పనిచేశేటప్పుడు శ్రామికులం,

కష్టపడేటప్పుడు కార్మికులం,

తల్లిదండ్రులకి సేవకులం,

ప్రేమించేటప్పుడు ప్రేమికులం,

వ్యవసాయం చేసేటప్పుడు కర్షకులం,

ప్రేమని పంచటంలో ధనికులం,

ఇవన్నీ పాటించే మాది మానవకులం,

మతమంటే:-

అన్ని కూలాలు మతాలు సమ్మతం,

కులాలు మతాల అని చిచ్చుపెట్టే వాళ్ళకి మేము అభిమతం.

అందుకే మనం నేర్చుకోవలసింది ఒక్కటే,

మాది మానవకులం, మాకు అన్ని మతాలు సమ్మతం.


కష్టపడాలన్నా ఈ క్షణమే,

ఆనందించాలన్నా ఈ క్షణమే,

చదావాలన్నా ఈ క్షణమే,

ఆడుకోవాలన్నా ఈ క్షణమే,

స్నేహం చెయ్యాలన్నా ఈ క్షణమే,

ప్రేమించాలన్నా ఈ క్షణమే,

బ్రతకాలన్నా ఈ క్షణమే,

బ్రతికించాలన్నా ఈ క్షణమే,

ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపొయింది కాబట్టి,

రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి

కాబట్టి (ఈక్షణమే) నీకు తక్షణం.

యువతకి కావలసింది సోమరితనం కాదు, పనితనం,

లే యువతా లే నీ భవిషత్తు గురించి ఈ క్షణం ఆలోచించూ,

నీ స్వశక్తిని దేశానికి ఉపయోగించూ.
స్నేహనికి పునాధి ఇష్టాలు అనేది నా భావన,

ప్రేమకి పునాధి అభిప్రాయలు అని నా భావన,

మనిషికి పునాధి మనసు అని నా భావన,

అందానికి పునాది ప్రక్రుతి అని నా భావన,

ఆనందానికి పునాది అనుబంధమని నా భావన,

ఇవ్వన్ని కలసున్నది నా స్నేహితులు అని నా భావన



నీవు వదిలి వెళ్ళి వారమైనా కాలేదుకదా కాని,

మనసు నీ ప్రేమలేక ఓంటరైయ్యింది, గొంతు నీ మాటలేక మూగబొయింది,

నీ రూపులేక నా కళ్ళు చీకటయ్యాయి,

ఇన్నాళ్ళు నీ దగ్గర వున్నంత కాలం నాకు తెలియలేదు ఇది ప్రేమని,

నువ్వు దూరమైన క్షణాలన్నీ కన్నీళ్ళుగా మారాయి,

నీకోసం నే కార్చిన కన్నీటిబొట్టు ఒక్కొక్కటే నన్ను నీ తలపులలొ ముంచేస్తుంది.

నీవు లేని ఈ విరహం నాకు నరకంలా వుంది,

నిన్ను త్వరగా చేరాలని నీ కౌగిలిలో నేను ఓదిగిపొవాలని ఏవొ ఆశలు,

త్వరగా రావా ప్రియతమా నాకోసం మన ప్రేమ కోసం.

నీకోసం కన్నీటి కళ్ళతో ఎదురుచూస్తూవుంటాను.




తన చిన్ని చిన్ని పాదాలతొ నా గుండెను తన్నినా నా చిన్నారి,

నాతొ తొలి ఆడుగులు నడిచినా నా చిన్నారి,

ఆడుకుంటానంటు నా భుజాలెక్కిన నా చిన్నారి,

భయమేస్తే నన్ను హత్తుకునే నా చిన్నారి,

కాలంతొ పాటు తాను పెద్దదయింది,

మనిషే మారుతుందనుకున్నాను,

మనసు కూడా మరిందని తెలుసుకో లేక పొయాను,

ప్రేమించేవాడే ఏక్కువా అని చెప్పి నా గుండెల మీద తన్నింది,

నన్ను వదిలి తనతో ఏడడుగులు నడవటానికి వెళ్ళిపొయింది,

మోసిన భుజాలనే తొక్కి పాతాళంలొకి నెట్టింది,

తానే నా అదౄష్టమనుకున్నా,

ఇప్పుడు ఆ అదృష్టమే నన్ను వాదిలి వెళ్ళిపొతుంది,

అంతేలే ఆడపిల్ల ఏప్పటికైనా ఆడపిల్లే కాని ఈడ పిల్ల కాదుగా.

ఎందుకు నాకు పరిచయమయ్యాయు,

ఎందుకు నాలొ ఆశలు రేపావు,

నీ చిన్ని చిన్ని పదాలతొ నా మాటలకి బంధం వేశావు,

కవితలే కదా పంపుతున్నాను అనుకున్నా ఇన్నాళ్ళు,

నా మనసుని నీకు ఇచ్చేస్తున్నాను అని తెలుసుకోలేకపొయా,

తెలుసు కున్నాక నీగురించి ఆలొచనలు,

నన్ను నేను మర్చిపోతున్నాను,

నిన్ను నాలొ కలుపుకుంటున్నాను,

ఎవరు నీవు ఎందుకిలా నన్ను వేధిస్తున్నవు,

తప్పు నాదే నిన్ను పరిచయం చేసుకున్నాను కదా,

స్నేహానికంటే ఎక్కువగా ఎదొ తెలియని అనుభూతి,

నీ స్చ్రాప్ కోసం రోజు ఎదురు చూస్తుంటాను,

నా కోసం కాకపొయినా కనీసం నా మనసు కోసమన్నా రోజు స్చ్రాప్ చేస్తుండు,

కాలాన్ని పరుగెత్తిస్తున్నాను,

రేపటి కోసం నీ సందేశం కోసం,

రోజులు గడుస్తున్నా ఇంకా నీ గురించి నాకేమి తెలియదు,

అప్పుడప్పుడు అడగాలని ఉన్నా నన్ను నువ్వు తప్పుగా అనుకుంటావని ఆగిపొతున్నాను,

కాని ఇప్పుడు నా వల్ల కావటం లేదు, నా మనసు నన్ను ఎదురించి తన భావాలని నీతొ పంచుకుంటుంది.

నీ ప్రొఫైల్ చూశాను నీ మనసు నాకు నచ్చింది,

అందుకే దైర్యం చేసి వ్రాస్తున్నాను నా ఈ తియ్యనిబాధ గురించి.

తప్పుని మన్నించు, తప్పక ఆలోచించూ.

నీ గొంతు విని, నా మనసుకి కొత్త వసంతం రావాలని ఆశతో......................

మనషి ఎవ్వరో తెలియదు,

మనసు మాత్రం కొంచెం తెలుసు,

పరిచయం మాత్రం అయ్యింది,

ఆక్షరాలే మాటలయ్యాయి,

మెసెజ్ లే బంధాన్ని పెంచాయి,

నీ స్రాప్ చూడగానే నా పెదవి పై చిరునవ్వు,

నా మనసుకి ఆనందం,

ఏమిటీ అనుబంధం,

నీ గురించి తెలుసుకోవాలని,

నీగొంతు వినాలని,

నీతో మాట్లాడాలని,

నిన్ను చూడాలని,

కాని నాకు ఇలాగే నచ్చింది

యెప్పుడు నీ స్చ్రప్ వస్తుందా అని యెదురు చుడటంలో ఒక ఆన్మదం,

నచింది నాకు తెలియని వ్యక్తితో నా అనుబంధం,

చెప్పలేని ఆనందం .

నిన్ను చూస్తే మనసులొని మాటలు గొంతు దాటి బయటకు రావటం లేదు,

ప్రేమించే వాళ్ళు బయపడరు కదా మరి నాకెందుకు నీతొ మాట్లాడటానికి ధైర్యం రావటం లేదు,

గొంతు మూగబొతుంది,

మాట తడపడుతుంది,

చేతులు వణకుతున్నాయి,

మన మద్య వున్న ఈ మౌనమనే సముద్రాన్ని ఎలా దాటాలి,

పోని నా ప్రేమతొ ఆ ఇంద్రధనస్సుని వంతెన చేసి ఆ చిరుగాలిని నా ప్రేమకు రాయబారిగా పంపిస్తాను,

అప్పుడన్నా నీ మనసు కరిగి నీ మాటల జల్లులు నా మనసుని తడుపుతాయేమొ చూడాలి.

లేకపొతే నా మనసు నీ ప్రేమదాహం తీరక ఎండిపొతుందేమో?

ప్రేమలొ పడ్డాక కాని తెలియలేదు,

అది మనసుని బాద పెట్టే తియ్యని బాధ అని,

మన కష్ట,నష్టాలను పంచుకునే ఒక బంధమని.

నీ తలపులు నా మదికి సంకెళ్ళు వేశాయి,

నీ మాటలు నా గోంతుకి తాళాలు వేశాయి ,

నీ నవ్వులు నా మనసుకి బంధాలు వేశాయి,

నీ చూపులు నా కళ్ళకి కళ్ళేలు వేశాయి ,

నీ జ్ఞాపకాలు నా జీవితానికి ఆనకట్టలు వేశాయి.

నీ మనసనే బంధీఖానాలొ నన్ను బంధించివేశావు,

నన్ను నన్నుగా వుండనీయకుండా బంధించి వేశావు ఇదేనా ప్రేమ బంధమంటే?

ఇన్నాళ్ళు నాలో ఇ ప్రేమభావన ఏమయింది?

నన్ను నేనే మర్చిపొయాను,నిన్ను నాలొ కలుపుకున్నాను.

ఇంక నాకంటూ ఏముంది నా మనసులో నువ్వు తప్ప?

నీతొ గడిపిని ఆ క్షణాలు చాలు స్వర్గాన్ని కూడ మర్చిపొవటానికి,

ఆ అమౄతాన్ని తాగినట్లుంది నీ అధరాలని చుంభించినప్పుడు,

అజంతా శిల్పానికి ప్రాణం పొశరా అన్నట్లుంది నీ దేహాన్ని తాకుతుంటే,

నా మొహావేశానికి నీ అందాలతొ ఆనకట్ట వేశవు కదా,

ఎంతొసేపు వెదికాను నీ సన్నని నడుముని కనిపించలేదు,

బహుశా నీ హ్రుదయ బరువుని మోయ్యలేక అది సన్నబడినట్లుంది,

అంగాంగాన్ని శౄంగారంలొ జత చేశావే,

నీ అందాలని ఒక్కొక్కటిగా చూస్తుంటే నిన్ను తయారు చేసినా ఆ భగవంతుడికి చేతెలెత్తి నమస్కరించాలి,

నీ సాంగత్యంలొ కలమంతా క్షణాలుగా మరిపొతున్నయి,

చిరునవ్వు నవ్వుతూ నా నుదుటిన పెట్టిన ఆ ముద్దు చాలు ఈ జీవితానికి,

ప్రేమతొ నన్ను కౌగిలించుకున్న క్షణాలు చాలు,

ఆఖరి క్షణాలలొ నువ్వు నాకిస్తానన్న బహుమతి ఇదేనా,

మరణాని కన్నా ముందే నాకు స్వర్గం చూపించావు,

అదేంటి నా శరీరం చల్లబడింది,

ఎందుకు నీ కళ్ళల్లొ కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి,

నా మాటలు నీకు వినిపించటం లేదేంటి,

ఎవరొ నన్ను తీసుకెళ్ళిపొతున్నారు నీ నుండి,

ఎలా చెప్పాలి వీళ్ళకు మన ప్రేమను విడతీయద్దని,

వెళ్ళిపొతున్నా ప్రియతమా ఈ లోకాన్ని,దానికన్నా ఎక్కువైనా నీ ప్రమని వదిలేసి.


నిన్న నీ గురించి కలలు,

నేడు నీ గురించి ఆలోచనలు,

రేపు నీ గురించి ఆశలు,

అన్ని రోజులు నీ గురించే

వర్షాకాలం నీ ఉహలతొ తడిసిపొతున్నా,

ఎండాకాలం నీ జ్ఞాపకలతొ ఆవిరైపొతున్నా,

చలికాలం నీ ఆలొచనలతొ వణికిపొతున్నా,

అన్ని కాలాలు నీ గురించే,

ఆ నింగిలొను నీ రూపమే,

ఆ నీటిలొను నీ అందమే,

ఈ నేలలొను నీ గుర్తులే,

అన్నింటా నువ్వే, అంతటా నువ్వే,

మరి నేనెక్కడున్నానా అని వెతికాను

అప్పుడు తెలిసింది నేను నీ మనసులొ వున్నానని.


అనుబంధమైన,అనందమైన నీతొనే,

ఇష్టమైనా, కష్టమైనా నీతొనే,

ఉహాలైనా, ఉసులైనా నీతొనే,

ప్రణయమైనా, పరియణమైనా నీతొనే,

మాటలైనా, పాటలైనా నీతొనే,

చిరునవ్వులైనా,చిరుకొపమైనా నీతోనే,

స్నేహమైనా, ప్రేమైనా నీతొనే,

కన్నీళ్ళైనా, ఆనందభాష్పాలైనా నీతోనే,

కలహాలైనా, కవ్వింపులైనా నీతొనే,

అన్ని నీతొనే జీవితమైనా, చివరికి మరణమైనా.

నా మనసు ద్వారం తెరిచే ప్రియురాలు ఏది,

నాతొ నడిచే నా సఖి ఏది,

నా ఆనందాన్ని పంచుకునే నా నేస్తమేది,

నన్ను ఓదార్చే నా హ్రుదయరాణి ఏది,

నా అడుగులతొ అడుగులు కలిపే నా సుందరి ఏది,

నా కన్నీళ్ళను తుడిచే నా తోడు ఏది,

నా చిటికిన వేలు పట్టుకొని నా ప్రేమికురాలేది,

నన్ను తనలొ కలుపుకున్న నా దేవత ఏది,

ఆ దివిలో ఉన్న, ఈ భువిలొ ఉన్న

నా మనసు తనని వెతుకుతునే వుంటుంది,

నాకు తెలుసు తను ఏదొ ఒక రొజు నా మనసులొకి చేరుతుందని

నీతొ మాట్లాడుతుంటే రోజులుకూడా క్షణాలుగా మారిపొతాయి

నీ జ్ఞాపకాలతో నెలలు కూడా నిమిషాలుగా మారిపొతాయి

నీ సన్నిహిత్యంలొ సంవత్సరాలు కూడా గంటలుగా మారిపొతాయి

మొన్నటిదాకా క్షణమైనా చాలు నీతొ మాట్లాడటానికి అని అనుకున్నా

కాని యుగాలు కూడా నీతో మాట్లాడుతుంటే ఘడియలుగా మారిపొతున్నాయి

అందుకే ఆ కాలంతొ పొరాడను నీ దగ్గర ఉన్నప్పుడు ఆగిపొమ్మని వినలేదు

ఐనా కాలానికి ఏం తెలుసు నా ప్రేమ విలువ

అందుకే నా ప్రేమబంధంతొనే ఆ కాలాన్ని బంధిస్తాను

నేనే మీ వెండితెరని,

మీకు ఆనందాన్ని పంచేదాన్ని,

మీకు ఆవేదనను తెప్పించేదానిని,

మీకు చేరువగ వున్నదానిని,

మీకు కాలక్షేమంగా వున్నదానిని,

మీకు మంచి సందేశం ఇచ్చేదానిని,

మీ అందరిని ఒక్కచోట కలిపేదానిని,

మీకున్న బాదలను కొంచంసేపు ఆపేదానిని,

నేను కాలిపోతు మీకు సంతొషన్ని పంచేదానిని,

కాని నన్ను మీరు ఒక తెరగానే చూస్తున్నారు,

నా ఈ రంగుల ప్రపంచం మీకు ఆనందాని పంచటానికే,

ఈ తెర మీదే ఎంతోమంది తారలుగా వెలిగారు,

ఇంకెంతో మంది సితార(స్టార్)లు గా మారరు.

తరాలు మారినా,తారలు మారినా ఈ తెర మాత్రం మారదు మీ కోసం.


అప్పుడే వర్షానికి తడిచి నీటి బిందువులతొ మెరుస్తున్న తామరాకులో,

చిమ్మచీకటిలొ వెలుగునిచ్చే జాబిలమ్మలో,

తెల్లవారుజామున పడుతున్న మంచుబిందువులో,

వేకువనే వినిపించే సుప్రభాతంలో,

ఆరుబయట అమ్మ వేసిన రంగులముగ్గులో,

అమ్మ ఒడిలొని చంటిపిల్ల చిరునవ్వులో,

సంధ్యా సమయాన అస్తమించే సూర్యుడి అరుణంలో,

ఎగసిపడి తీరం చేరే సముద్రపు అలలలో,

అన్నింటి లోను నువ్వే,

ప్రతి అందంలోనూ నువ్వే, అనందంలోను నువ్వే.

చిరుగాలి కూడ చిన్నబొద నీ చిరునవ్వుని చూస్తుంటే,

ఉరిమే ఉరుములు కూడ ఆగిపొవా నీ కంటి మెరుపులు చుస్తుంటే,

ప్రవహించే నదులు కూడా స్తంభించిపోవా నీ నల్లని కురులు చూస్తుంటే,

హంస కూడా సిగ్గుపడదా నీ నడక చూసుంటే,

నెమలి కూడా నాట్యం మానెయ్యదా నీ నాట్యం చూస్తుంటే,

కోకిల కూడా మూగబొతుందిగా నీ స్వరం వింటుంటే.

అందానికే చిరునామా నువ్వు,

నా ఆనందానికి మూలం నువ్వు

బ్రహ్మ కూడా ఆశ్చర్యపోడా ఒక్కసారిగా నిన్ను చూస్తే

గర్వంతొ పొంగిపోడా తానే నిన్ను సౄష్టించాడని తేలిస్తే

ఆ చీకటిలొ వెలిగే ఆ మిణుగురు పురుగుని చూసి

నేనెందుకు ఈ లోకంలొ బతకలేనని

తను కరిగిపొతూ వెలుగు నిచ్చే ఆ కొవ్వొత్తిని చూసి సిగ్గుపడ్డాను


నేనెవ్వరికి సహాయం చెయ్యలేదని


ఆకాశంలొ స్వేచ్చగా ఎగిరే పక్షిని చూసి సిగ్గుపడ్డాను


అన్ని వున్న నేనెందుకు ఈలా బంధీగా వున్నానని


నన్ను చూసుకునే మనుషులు వున్నారు


కాని నన్ను అర్ధం చేసుకునే మనుషులు లేరు


ధనం వున్నా ఎం లాభం అక్కడ స్వేచ్చ లేనప్పుడు


ప్రాణమున్నా ఎం లాభం అక్కడ ప్రేమ లేనప్పుడు


ఎన్నొ క్షణాలు గడిచిపొయాయి కన్నీళ్ళతొ


ఎన్నొ ఆశలొ ఆవిరయ్యావి ఆకాశంలొకి


కోట్లు వున్నా ఏం లాభం ప్రేమను కొనలేనప్పుడు


అందుకే అన్నీ వదిలేసి బయలుజేరాను ప్రేమని వెతుకుతూ.......................




నీ ఆలొచనలతొనే నా గుండె బరువెక్కయి అందుకే,

నీ జ్ఞాపకలు కన్నీళ్ళుగా మారి బయటకొస్తున్నాయి

నా కళ్ళు ఎదురుచుస్తున్నాయి వాటి కన్నీళ్ళని తుడిచే నీ కోసం

వాటికేం తెలుసు నన్ను నువ్వు చేరలేవని

ఐనా నేనే కదా మరణించింది నా మనసు కాదు కదా

కాని నాకు తెలుసు నువ్వు ఏదొ రోజు వస్తావని

నా కన్నీళ్ళను ఆనందబాష్పాలుగా మారుస్తావని

కాని నా కోసం నువ్వు మరణించటం నాకు ఇష్టం లేదు

నేను ఆత్మనే ఐనా నాకు నీ మీద ఆప్యాయత వుంది

దేవుడినన్నా ప్రార్ధిస్తాను నన్ను నీలొ ఐక్యం చెయ్యమని
నిన్ను చూసిన నా కళ్ళు లొకన్ని చూడటం మానేశాయి

నీ అందం అనే సంకెళ్ళతొ వాటిని బంధించేశావు

నిన్ను ప్రేమించిన నా మనసు ఇంక ఎవ్వరిని ప్రేమించనంటుంది

నీ ప్రేమతొ దానిని అంతగా ఆకర్షించావు

కాని నువ్వు నిన్ను కాదని తనని ప్రేమించమంటున్నావు

ఎలా నా మనసు తనని ప్రేమిస్తుంది

ఎలా నా గుండె తన కొసం కొట్టుకుంటుంది

నాకు ప్రేమని పంచటం తెలియదు ప్రేమించటమే తెలుసు

నా గుండెని చీల్చాను నీ పెదవుల ఎరుపు కోసం

ఆ గులాబిలని అడీగను నీ బుగ్గమీద గులాబి రంగుకొసం

ఆ చంద్రుడిని బ్రతిమాలను నీ కన్నులలొ కాంతికొసం

ఆ తామరాకులని వేడుకున్నను నీ చేతులలొ మ్రుదుత్వంకొసం

నా సూర్యుడిని ఆర్ధించాను నీ మోములొ తేజస్సుకోసం

అన్ని నేను నీకు ఇచ్చినవే కదా మరి నీకంటు ఏముందని ఆ అహంకారం

ఎందుకు నా ప్రేమకు తిరస్కారం

ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం

నీ పరిచయం నాకు ప్రేమను నేర్పించింది

నీ అందం నాకు బంధం వేసింది

నీ మాటలు నా ప్రేమకు బాటలు వేశాయి

నీ నవ్వులు నన్ను మైమరపించాయి

నీ చూపులు నా గుండెను తాకాయి

నీ అభిమానం నీ పై నా ప్రేమను పెంచాయి

నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని

కాని అది నీకు తెలియాలంటే ఎలా

నీకు అనందం కలిగినప్పుడు నన్ను హత్తుకుంటావు చూడు అదే ప్రేమ

నీవు ఒంటరిగా వున్నప్పుడు నన్ను తలచుకుంటావే అదే ప్రేమ

నేను కనబడనప్పుడు నా సెల్లులొ మెసేజ్ బాక్స్ నిండిపొతుంది చూడు నీ మెసేజ్ లతొ అదే ప్రేమ

నేను ఏ అమ్మయితొ ఐనా మాట్లడుతుంటే నీ కళ్ళు ఎరుపెక్కుతాయే అదే ప్రేమ

పొద్దున్నే నా మెసేజ్ రాకపొతే నువ్వు నన్ను తిడతవు చూడు అదే ప్రేమంటే

ఇంకా అర్ధంకాలేదా నీకు ప్రేమంటే

ఏ బాషలొ చెప్పాలి నీకు

కనీసం నీ మనసు నన్న అడిగి చూడు

నా మనసు పడే బాదేమిటో

నీ జ్ఞాపకలు చాలు నా జీవితానికి,

నీతొ గడిపిన క్షణాలు చాలు నా జన్మకి,

నీ ఊసులు చాలు నా ఊపిరికి,

నీ నవ్వులు చాలు నా ఆనందానికి,

నీ మాటలు చాలు నా చిన్ని గుండె పొంగిపొవటానికి,

నీ చూపు చాలు నా కంటిపాపలకి,

చిన్నప్పుడు ఎన్నొ అడుగులు నేర్పిన నాన్న ప్రేమని కూడా మించిపొయెలా చేశవు నీ ఏడడుగులతొ,

పాలుపట్టిన తల్లిప్రేమను గుర్తుచేశవు, నీ తీపి ప్రేమతొ,

తల్లితండ్రులని తలపించేలా వున్న నీ ప్రేమకన్నా నాకు ఏం కావాలి ఈ జీవితానికి.

నువ్వులేక బాధ పడుతున్నాను

ఎప్పుడైతే నా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటానో,

ఎప్పుడైతే నేను ఒంటరిగా వుంటానొ,

ఎప్పుడైతే నేను బాధలొ తొడుకోసం ఎదురుచూస్తుంటానొ,

ఎప్పుడైతే నేను నిన్ను తలచుకుంటానో,

ఎప్పుడైతే నువ్వు నాకు కనిపించవొ,

ఎప్పుడైతే నా మనసు నిన్ను చేరాలనుకుంటుందో,

ఎప్పుడైతే నాకు నువ్వు గుర్తొస్తుంటావొ,

ఎప్పుడైతే నీతొడు లేకుండ నేను ప్రయాణిస్తుంటానో,

ఎప్పుడైతే నువ్వు కాకుండ వేరెవరొ నన్ను అభిమానిస్తుంటారొ.

ఎప్పుడైనా నువ్వు నా చెంతనే వుండాలి

ఎప్పుడైనా నువ్వు నా దానిగా వుండాలి

అప్పుడప్పుడు ఆలొచిస్తుంటాను నేను ప్రేమికుడినా లేక స్వార్దపరుడినా అని,

ఐనా ఎప్పుడు నా గురించే అలొచిస్తున్నాను కాని నీ మనసేమిటొ తేలుసుకొలేకపొయాను,

అవును నిజమే నేను ప్రేమికుడిని కాదు స్వార్దపరుడిని.


నా మనసుని అడిగా తనని మర్చిపొమ్మని కుదరదన్నది

నా కన్నులకి చెప్పాను తనని చూడద్దని విననన్నవి

నా గుండెకి చెప్పాను తనకొసం కొట్టుకొవద్దని ఆగనన్నది

నా పాదలకి చెప్పాను తన దగ్గరకి నడవద్దని ఆపనన్నవి


నా చేతులకి చెప్పాను మ్రుదువైన తన చేతులని
పట్టుకొవద్దని వాటి వల్లకావన్నవి

నాది అనేది ఏది నా మాటవినటంలేదు

నేను నేనుగా లేను నీకొసమే ఆలోచిస్తూ నీలొ కలసిపొతున్నాను

ఏందుకు నన్ను బ్రతికున్న శవంగా మారుస్తున్నావు

నిన్ను ప్రేమించటమే నేను చేసిన తప్పా

చిరుగాలికి కదిలే నీ కురులు,

కలువపువ్వులను తలపించే నీ కనులు,

ఆ గూలాబిలొని రంగును పులుముకున్న నీ పెదవులు,

ఆ స్వర్ణం కన్నా మెరిసి పొయె నీ దేహం,

ఏ శిల్పి తయారు చేశాడొ నిన్ను,

ఏ దేవుడు ప్రాణం పొశాడొ నీకు,

ఆ మోనాలిసా కూడా నిన్ను చూస్తే ఈర్ష్య పడుతుందేమో

మరి జనమేమిటి ఏడే వింతలంటారు

బహుశా నిన్ను చూసివుండక పోవచ్చు.

నీ నవ్వుల జాబిల్లితొ నా మనసులొ వెన్నెల కురిసింది

నీ మాటల చినుకులతొ నా హ్రుదయం తడిసింది

నీ చూపుల కాంతితొ నా గుండెలొ మెరుపు మెరిసింది

నీ అనురాగ,ఆప్యాయలతొ నా మనసు కరిగింది

నీ ప్రేమ తిరస్కారంతొ నా గుండె పగిలింది

నీ ప్రేమ మత్తుతొ నా జీవితం సర్వం ముగిసింది

ఆ వెన్నెల వన్నె తగ్గింది నీ అందం చూసి,

ఆ నీలిమేఘాలు తెల్లబొయాయి నీ నీలికళ్ళను చూసి,

ఆ సూర్యుడి ప్రకాశమైన కాంతి కూడ చీకటయింది,నీ మోములొని కాంతిని చూసి,

ఆ పువ్వులు కూడ వాడిపొయాయి నీ నవ్వులు చూసి,

నా మనసు కూడా ఆవిరైపొయింది నీ సోగసు చూసి.

మనస్సు చెప్పిన మాట వినటం లేదు

నిన్ను చూసిన్నప్పటి నుండి,

ఎందుకు దానిని నా నుండి దూరం చేయ్యాలనుకుంటున్నావూ

నిన్ను ప్రేమించటం నేను చేసిన నేరమా

మనిషిని చంపితేనే నేరమైతే

మనస్సును చంపిన నిన్ను ఎమనాలి

ఇన్నాళ్ళూ నేను ప్రేమించింది ఒక మనస్సు లేని మనిషినా

జీవితమంతా నిరిక్షిస్తాను నీతొ స్నేహం చెయ్యటానికి

క్షణమైనా కేటాయించలేవా నాతొ మాట్లాడటానికి

పరిచయం కొసమే కద ఈ ప్రాయాస

ఏదొ ఒక రొజు కరుణిస్తావని ఒక చిన్న ఆశ

రగిలే నా మనస్సునైతే నీ ప్రేమ చల్లార్చగలదేమో కాని

పగిలిన నా గుండెను నీ ప్రేమ అతికించలేదు

ఎందుకంటే పగిలిన నా మనస్సు తొ పటే అందులొ ఉన్న నీ ప్రతిబింబము కూడా మాయమైంది
నీతొ పరిచయం సుమధురక్షణం,

నీతొ గడిపే సమయం అమ్రుతమయం,

నీతొ నడిచే మార్గం రాజమర్గం,

నువ్వే లేని క్షణం మరణిస్తా తక్షణం

కాలం కరిగి పొతుంది, నువ్వు నాతొ లేకుండానే

మనసు రగిలి పొతుంది, నీ మనసుని అర్దంచేసుకొలేదని

గుండె పగిలి పొతుంది, నువ్వు నాకు దక్కవని తెలిసి

పరిచయమైన లేదు కాని

నా కళ్ళు నిన్ను చుడాలని

నా చేతులు నిన్ను తాకాలని

నా మనసు నిన్ను ప్రేమించాలని

నా గొంతు నీతొ మట్లాడాలని

నా పాదలు నీతొ నడవాలని

కొరుకుంటున్నాయి, అసలు ఇది నా దేహమేనా,

నన్ను కాదని అవి నిన్ను కొరుకుంటున్నాయి

బహుశా నేను, నేను కాదేమో నీకొసం ఎదురు చూస్తూనే నేను కూడా నీలొ కలసి పొయానా ?

నీ కన్నులకి సూర్యుడు కాంతి నిచ్చాడు,

నీ నవ్వులకి పువ్వులు సొగసు నిచ్చాయీ,

నీ పెదవులకు గులాబిలు రంగునిచ్చాయీ,

నీ గొంతుకి కొకిల స్వరాన్నిచ్చింది,

నీ సొగసైన శరీరానికి దేవుడూ ప్రాణం పోసాదు,

మరి నేనేమి ఇవ్వగలను నీకు,

అందుకే నేను ముక్కుపుడకనై నీ మోముకి అందాన్ని ఇవ్వాలనుకుంటున్నాను.

ఆకాశంలొ నుండి ఒక నక్షత్రం నేలపైకి వచ్చిన రోజు,

నిండుచంద్రుడి పండువెన్నెల భువిని చేరిన రోజు,

హరివిల్లు ఆకాశానికి రంగులిచ్చిన రోజు,

మేఘాలు ఆనందంతో చిరిజల్లులు కురిపించిన రోజు,

మంచు బిందువులు మనసుని తడుపుతున్న రోజు,

కోకిలా గొంతు విప్పిన రోజు,

పాటకి నెమలి నాట్యం చేసిన రోజు,

ఆనందాలు, అందాలు ఒక్కసారిగా వచ్చిన రోజు,

ఆదే అదే నీ పుట్టిన రోజు.

నా కోసం ఒక నేస్తం పుట్టిన రోజు,

స్నేహానికి ప్రాణమిచ్చే నా నేస్తం పుట్టినరోజు,

ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు నేస్తమా.

కడదాకా కన్నీళ్ళే మిగిలాయి,

ఆప్యాయతల కోసం ఏదురుచుస్తున్న నా మనసుకి,

బాధతొ గుండె బరువెక్కింది,

నీ ప్రేమ ఇక దోరకదని తెలిసి,

చిన్నప్పటి నుండి ఎన్నొ కష్టాలు పడ్డాను,

నీ రాకతో నా జీవితంలో ఎక్కడొ చిన్న ఆశ కలిగింది బ్రతకాలని,

కాని నా ప్రేమ నిన్ను కరిగించలేక పొయింది,

ఐనా ఒక విధంగా ఆలోచిస్తే నేను స్వార్దంతోనే నిన్ను ప్రేమిస్తున్నా,

అందుకే నా ప్రేమ నీ మనసుని చేరలేదేమో?

కనీసం నా కన్నీటిని తుడిచే నేస్తమైనా అవ్వలేవా,

చాలు జీవితానికి ఆనందమన్నా.

నువ్వీకలేవని తెలిసినప్పటినుండి,

కన్నీళ్ళు ప్రవాహం ఆగటంలేదు,

కాలాన్ని నా ప్రేమతో వెనక్కి తిప్పాలనుకుంటున్నాను,

దేవుడిని ఎదురించాలనుకుంటున్నాను,

మనసులో రగిలే జ్వాలతో కళ్లు ఎరుపెక్కాయి,

జ్వాలతో ఎరుపెక్కినా నా కళ్ళు సూర్యుడిని కూడా కాల్చేశేలా ఉన్నాయి.

కాని ఏమిచెయ్యలేకున్నాను,

నిన్ను మళ్ళీ ఎలా బ్రతికించుకోవాలా అని వేదన పడుతున్నాను,

పోని నా ప్రేమకి ప్రాణం పోసి నీ దేహంలోకి పంపించామని దేవుడిని కోరుకుంటాను.

మరణం నాకు ప్రసాదించి నీకు ప్రాణం పొయ్యమంటాను,

కనీసం గాలిలో కలిసిపొయైనా నీకు శ్వాసనవుతాను.

చూపు నీదైనా కన్నులు నావి అని అన్నవు,

కన్నులు నీవని తెలిసి కూడా బాధ పెడుతున్నావు,

స్పందన నీదైనా హ్రుదయం నీదన్నావు,

హ్రుదయం నీదని తెలిసి కూడా ప్రేమించనంటున్నావు,

మరి ఇక నాకు కన్నులేందుకు,

హ్రుదయమెందుకు,

నా కన్నీటికి కారణం నువ్వే,

నా హ్రుదయ రోదనకి కారణం నువ్వే,

చివరికి నన్ను బ్రతికున్న శిలగా మార్చవు.

నీ విరహ వేదనతో శిల కూడా కన్నీరు కారుస్తుంది.

తిరిగి నీ ప్రేమతో శిలకి ప్రాణం పొయ్యలేవా?

నా గుండెలొ మండె సూర్యుడిని చల్లార్చే ప్రేమ కావాలి,

మనసులొ రగిలే ఆగ్నిపర్వతాన్ని చల్లార్చే ప్రేమ కావాలి,

నా కన్నీటి జలపాతాలని ఆపే ప్రేమ కావాలి,

నా బాధలు మర్చిపొయేలా చేసే ప్రేమ కావాలి,

నన్ను నేనే మర్చిపొయేలా చేసి తనలొ కలుపుకునే ప్రేమ కావాలి,

ఎక్కడని వెతకలి ప్రేమ కోసం,

నా చీకటి జీవితంలొ వెలుగునిచ్చే దీపం కోసం,

నా మనసుని చల్లర్చే చంద్రబింబంకోసం

ఒక్కసారి కనిపించవా ప్రియతమా...........

నీతొ నడిచిన క్షణాలన్ని నన్ను ఇప్పుడు ప్రశ్నించాయి,

ఎందుకు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వలేదని,

నీతొ మాట్లాడిన నా గొంతు ఇప్పుడు నాకు చెప్పింది,

తను కలిసే దాక తను మాట్లాడనని,

నీతొ నడిచే నా పాదలు చెప్తున్నాయి,

తమతొ పాటు నడిచే నీ పాదలు లేనిదే అవి కదలమని,

కాని వాటికేం తెలుసు నువ్వింక తిరిగి రావని,

నువ్వీ లోకంలొ లేవని,

నువ్వు మరణించి నన్ను మాత్రం ఏందుకీ లోకంలొ ఒంటరిగా వొదిలేశవు,

నువ్వు లేకుండా నేను మాత్రం ఎల బ్రతికుంటాననుకున్నావు.

నువ్వు చనిపొయినా క్షణమే నా ప్రేమ నీకొసమని నన్ను వదిలేసింది,

నా కళ్ళకి చీకటి అలుముకుంది,

నా శరీరం చల్లబడింది,నా గొంతు మూగబొయింది,

నా గుండె ఆగిపొయింది.

నిన్ను చూశేదాకా తెలియలేదు నేను కూడా క్షణమే చనిపొయానని,

ఐనా నా మరణం నాకు ఆనందమే ,

అది నన్ను నీదగ్గరకు చేర్చింది కనుక.

మేము అనాధలము,

చిన్నప్పుడు ఆకలేస్తే పాలు పట్టటానికి అమ్మ లేదు,

నడకలు నేర్పటానికి నాన్న లేడు,

ఆదరించే బందువులు లేరు,

అభిమానించే ఆత్మీయులు లేరు,

దాహం తీరటానికి కన్నీళ్ళే నీరయ్యయి,

ఆకలి తీర్చటానికి పాచన్నమే పరమాణ్ణమైంది.

తినటానికి, తాగటానికి ఏమి లేకపొయినా, ఆశలు మాత్రం మనసు నిండా ఉన్నాయి.

అమ్మ ఒడిలొ నిద్ర పోవాలని,

నాన్న చేతులు పట్టుకు నడవాలని,

అందరిలా చదువుకోవాలని,

ఆనందంగా గడపాలని, కాని

చీకటిరోడ్డులే తల్లి ఒడి అయ్యాయి,

ఆకలి బాధలే నడక నేర్పాయి,

చిత్తు కాగితాలే చదువునేర్పాయి,

కడుపు నిండటమే ఆనందమైయ్యింది

ఎవరి పాపమో మా జన్మగా మారి శాపమైంది,

వాళ్ళ క్షణికావేశంతొ మా జీవితం దౌర్భాగ్యమైంది.

ఎన్నొ రోజులనుండి ఎదురుచూస్తున్నా మా జీవితాలు మార్చటానికి ఎవరైనా వస్తారేమో అని.

ఆశలు ఆవిరయ్యాయి,బ్రతుకులు కన్నీటిమయమయ్యాయి.

కడదాకా కన్నీళ్ళే మిగిలాయి,

ఆప్యాయతల కోసం ఏదురుచుస్తున్న నా మనసుకి,

బాధతొ గుండె బరువెక్కింది,

నీ ప్రేమ ఇక దోరకదని తెలిసి,

చిన్నప్పటి నుండి ఎన్నొ కష్టాలు పడ్డాను,

నీ రాకతో నా జీవితంలో ఎక్కడొ చిన్న ఆశ కలిగింది బ్రతకాలని,

కాని నా ప్రేమ నిన్ను కరిగించలేక పొయింది,

ఐనా ఒక విధంగా ఆలోచిస్తే నేను స్వార్దంతోనే నిన్ను ప్రేమిస్తున్నా,

అందుకే నా ప్రేమ నీ మనసుని చేరలేదేమో?

కనీసం నా కన్నీటిని తుడిచే నేస్తమైనా అవ్వలేవా,

చాలు జీవితానికి ఆనందమన్నా.