కొంటెనవ్వుతో చూసే ఓరకంటిచూపులు
ఉలిక్కిపడి నిదురలేచిన ఆశలు.

దూరమయ్యే నీ మువ్వలచప్పుళ్ళు,
ఆగిపోతున్న నాగుండె చప్పుళ్ళు.

కనుమరుగవుతున్న నీ ప్రతిరూపం,
కనులకు అది కన్నీటి శాపం.

అస్తమిస్తున్న నీ కనుల అరుణాలు,
నా మనసుకి చీకటితోరణాలు.

ఏకాంతంలో కదలాడే నీ తియ్యని జ్ఞాపకాలు,
చెంతలేవని గుండెకుచేసే గాయాలు

నీకై ఎదురుచూసే నా  తడి నయనాలు,
మనోరుధిరం నింపుకున్న ఎరుపుచారలు.