నీకే...చిరునవ్వుల అలలతో నన్ను కవ్విస్తూ, నాకందకుండా మనసుతీరాన్ని తాకేసి వెళ్ళిపోతావు.
నీకోసం నే రాసుకున్న కవితలని, దాచుకున్న ఆనందాలని చెరిపేస్తూ నీతో తీసుకెళ్ళిపోతావు.

కాని నీ ఎడబాటులో తడిసిన ఆ మనసుతీరపు కన్నీటిచెమ్మను మాత్రం అలాగే కానుకగా వదిలేసిపోతావు.

 ఏమనుకుంటున్నావు?,,,,,,,,నన్ను బాధపెట్టాను అని నీలో నువ్వు నవ్వుకుంటున్నావా?
ఒక్కసారి నీ గుండెలోతుల్లొకి వెళ్ళి చూడు నా ప్రతిజ్ఞాపకం ఒక ఆణిముత్యమై నీలో దాగివున్నదో....లేదో?