వలపుల వెలుగువు నువ్వనుకున్నాను...
కాని ఆ వెలుగే విరహపు నీడవని పరుస్తుందని గ్రహించలేకపోయాను.
ఆ నీడని వదలడానికి...నా జీవితాన్ని చీకటి చేసుకున్నాను.

కనుల నిండిన ఆనందభాష్పాలు నువ్వనుకున్నాను....
కాని మనసుని బాధపెట్టి కనులనుండి జారుకునే కన్నీరువని ఆలోచించలేకపోయాను
ఆ కన్నీటిని దాచుకోలేక....అనుక్షణం నీ ఎడబాటులో రోధిస్తున్నాను...

హృదయపు అద్దంలో ప్రతిభింబం నువ్వనుకున్నాను...
కాని నీ రూపు కనుమరుగైన మరుక్షణం ఆ హృదయం పగిలిపోతుందని తెలుసుకోలేకపోయాను.
ఆ హృదయన్ని అతికించలేక...ఈ బాధని భరించలేక నరకం అనుభవిస్తున్నాను.

ఇంక నా జీవితంలో వెలుగు నిండెదెపుడో....నా నయనలలో కన్నీరు ఇంకేదెపుడో...
నా గుండెలో బాధ తీరేదెపుడో.... కనీసం మరణమైన నను పిలిచేదెపుడో...






నీ రాకతో గుండెలో ఏదో తెలియని అలజడి... నీ ప్రేమకై నా మనసు అడుగుల వడివడి....
నీ రూపులో నా చూపులు చిక్కుబడి....నీ ప్రేమలో పడిపోయింది నా ఎద తడబడి....

పరిచయ ప్రయత్నం భగీరధమే, ఫలించి మనసుని చేరింది నీ ప్రేమసాగరమే...
నీ తోడులో కరిగిన కాలం వసంతమే, నా హృదయతీరం చేరిన నీ ప్రేమలు అనంతమే...

నీ స్వరాల సంగీతంతో, గజ్జెలు కట్టి నాట్యం చేయును నా హృదయం...
నువ్వు పంచే ప్రేమతో, ఆనందపు అలలై ప్రవహించే నయనసంద్రం...

ఒక్కసారి నా చెయ్యి పట్టుకో....కొత్త జీవితానికై నీతో ఏడడుగులేస్తాను...
నా ప్రేమలో నీకొక్క కన్నీటిచుక్క రాలినా, మరుక్షణం నా ప్రాణాలు వదిలేస్తాను...








కనులకిక చీకటే కదా ....
నీ రూపుతోపాటు, నా చూపు దూరమవుతుంటే....

పెదవికిక మౌనమే కదా....
నీ పేరుతోపాటు, నా పలుకు వదిలిపోతుంటే...

మనసుకిక నరకమే కదా...
నీ ప్రేమతోపాటు, నా సంతోషం వెళ్ళిపోతుంటే...

హృదయమిక శిలనే కదా...
నీ స్నేహంతోపాటు, నా జీవం కనుమరుగవుతుంటే...

నాకిక మరణమే కదా....
నీ ఊహతోపాటు, నా ఊపిరి సెలవుతీసుకుంటుంటే...

ఆనందంగా జీవించు చెలి.....

నేనులేని నీ జీవితంలో.... ప్రేమ లేని ఆ ప్రపంచంలో...
సుఖాలను సంతోషాలనుకుంటూ..... ఐశ్వర్యాలను ఆనందాలనుకుంటూ...