కనులకిక చీకటే కదా ....
నీ రూపుతోపాటు, నా చూపు దూరమవుతుంటే....

పెదవికిక మౌనమే కదా....
నీ పేరుతోపాటు, నా పలుకు వదిలిపోతుంటే...

మనసుకిక నరకమే కదా...
నీ ప్రేమతోపాటు, నా సంతోషం వెళ్ళిపోతుంటే...

హృదయమిక శిలనే కదా...
నీ స్నేహంతోపాటు, నా జీవం కనుమరుగవుతుంటే...

నాకిక మరణమే కదా....
నీ ఊహతోపాటు, నా ఊపిరి సెలవుతీసుకుంటుంటే...

ఆనందంగా జీవించు చెలి.....

నేనులేని నీ జీవితంలో.... ప్రేమ లేని ఆ ప్రపంచంలో...
సుఖాలను సంతోషాలనుకుంటూ..... ఐశ్వర్యాలను ఆనందాలనుకుంటూ...

9 comments:

సుభ/subha said...

హను గారూ చాలా బాగుంది..మళ్ళీ బహుకాల దర్శనం.. ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుంటోందా?

జ్యోతిర్మయి said...

హను గారూ చాలా రోజులకు కనిపించారే..కవిత బావుందండీ..

జలతారువెన్నెల said...

"సుఖాలను సంతోషాలనుకుంటూ..... ఐశ్వర్యాలను ఆనందాలనుకుంటూ..." చాలా బాగుంది

రఘు said...

నేనులేని నీ జీవితంలో.... ప్రేమ లేని ఆ ప్రపంచంలో...
సుఖాలను సంతోషాలనుకుంటూ..... ఐశ్వర్యాలను ఆనందాలనుకుంటూ... chala chala bagundi.

వనజవనమాలి said...

baagundi.
nenu mee blog ni modatisaarigaa choosthunnaanu.
niraasha,nindaaropaNa rendu..vidanaadandi.
prema Jeevitamlo oka bhaagam maatrame!
preme jeevitam kaadu.
All the Best.

బాలకృష్ణా రెడ్డి said...

కనులకు చూపులు
పెదవికి పలుకులు
మనసుకు సంతోషం
హృదయానికి జీవం
మరణం ఉపిరి
మంచి అన్వయంతో
కవిత పలికించారు విషాదం ఒలికించారు
'ఆనందమే జీవిత మకరందం' అన్నారు
అందంగా ఒకకవిత రాయండి

హను said...

thnks to all

oddula ravisekhar said...

ఎడబాటు మిగిలించే విషాదం లోనే ఇంత లోతయిన కవితలు పుడతాయి.చక్కని కవిత .ఆనందమేదో కొంతకాలానికి తనకి అర్థమవుతుంది .అప్పుడు మీ సహచర్యమెంత మధురమో తనకి తెలుస్తుంది.తను కవి అయితే కొంతకాలానికి తన నుండి కూడా ఓ కవిత రావొచ్చు

మనసు said...

nenu ee roju nundi mi fan andi

Post a Comment