చిగురు తొడిగిన కొమ్మపై చినుకు చేసే అందాలు,

చినుకు తాకిన పుడమిపై మట్టి పంచే పరిమళాలు,


పుడమి పంచిన ప్రేమతో ప్రకృతి చూపే సోయగాలు,


ప్రకృతి సోయగాలతో పరవశించి కోయిల పాడే స్వరాలు,


కోయిల స్వరాల మాధుర్యంతో మది రాసిన కావ్యాలు,


మది రాసిన కావ్యాలతో చెలి చెక్కిళ్ళపై చిరునవ్వులు,


ప్రతి అందం అద్బుతం, ప్రతి అంశం అమృతం.

మది నిండిన నీ ఆలోచనలు,

నిన్ను వెతకమని కనులను కలవరపెడుతుంటే,

నీ రూపం కనబడక అవి కన్నీరు పెడుతుంటే,

మనసు నిన్ను స్వప్నంలో ప్రతిబింబిస్తానంటే,

నిదురలో కూడా మధురస్వప్నమే కదా

ఆదమరచి జగతి నిదురించు వేళ నీ తలపులు మదిలొ తచ్చటలాడుతూ నన్ను కవ్విస్తుంటే,

నింగిలోని చందమామ తన మోముపై నీరూపాన్ని పులుముకొని నన్ను ఆటపట్టిస్తుంటే,


చల్లని చిరుగాలులు నీ చిరునవ్వును మోసుకొచ్చి నన్ను వెక్కిరిస్తుంటే,


ఇంటి ముందు మల్లెపందిరి నీ శ్వాసను పరిమళంగా మార్చి నన్ను పిచ్చివాడిని చేస్తుంటే,


నిశిరాత్రి ఐనా నీ ఊహలు మదిలో ఊయలూగుతుంటే,


నిన్ను నింపుకున్న కన్నులకు నిదుర కరువే కదా చెలి.


గాయపడ్డ ఎన్నో హృదయాలకు స్పందన నువ్వయావు,

ఎంతో మంది పేదవాళ్ల కన్నీటిని తుడిచిన అభయహస్తం నువ్వయ్యావు,

ఆకలి బాదలు తీర్చి, రైతన్నలకు చేయుత నిచ్చావు,

రాష్ట్రజనం అంతా నీకు నీరాజనం పడుతుంటే,

కడకు కన్నీటిని కానుకగా ఇచ్చి మమ్ము ఒంటరిని చేశావా రాజశేఖరా!!