జ్యొతివై నా చీకటి హృదయంలో వెలుగు నింపుతావనుకున్నాను,
కాని జ్వాలవై నా హృదయాన్ని మండిస్తున్నావు,
ఐనా ఆనందమే నీ చూపుల జ్వాలలలో మండుతున్నందుకు.

అలవై నా మనసుతీరం తాకుతావనుకున్నాను,
కాని కలవై నన్ను విరహసంద్రంలోకి తోసేశావు,
ఐనా ఆనందమే నీ మనసులోతు తెలుసుకుంటున్నందుకు.

నింగివై నీ ప్రేమ జల్లులలో నన్ను తడుపుతావనుకున్నాను,
కాని పిడుగువై నా గుండెని బూడిద చేశావు,
ఐనా ఆనందమే నీ కన్నుల కాంతిలో నా గుండె బూడిదైనందుకు.

ఊపిరివై నా గుండెలో నిండిపోతావనుకున్నాను,
కాని ఉప్పెనవై నామనసును నా నుండి దూరంగా తీసుకెళ్ళిపోయావు,
ఐనా ఆనందమే నన్ను వదిలిన నా మనసు నీతో వెళ్ళిపోయినందుకు.

భువివై నన్ను నీ ఓడిలో దాచుకుంటావనుకున్నాను,
కాని భూకంపమై నీ మాటల ప్రకంపనాలతో నా ప్రాణం తీశావు,
ఐనా ఆనందమే నేను మరణించినా నా తనువు నీలో ఐక్యమవుతున్నందుకు.

అమ్మలోని ఆప్యాయతను అందిపుచుకున్న అనురాగానివి నువ్వు,

నాన్నలోని నిరాడంబరతను నింపిబుచుకున్న నువ్వు,

ప్రతి క్షణం ప్రేమను పంచే ప్రాణానివి నువ్వు,

అనుక్షణం అబిమానాన్ని అందించే అపురూపానివి నువ్వు,

చిరునవ్వుల ఉదయాలతో నా గుండెలో ఆనందపు కిరణాలను ప్రసరిస్తావు,

మధురమైన మాటలతో నా మనసులొ చిరుజల్లులు కురిపిస్తావు,

ఈ ప్రేమ ప్రతి క్షణం నాకు నీడలా తోడుండాలని,

నీకు ప్రతీక్షణం నేను తండ్రిలా తోడుంటానని ఈ రక్షాబంధనం ద్వారా తెలుపుతున్నాను,

"రక్షాబంధనం" శుభాకాంక్షలు నా చిరునవ్వుల చెల్లెలికి.


నేస్తమా ఎలా నీకు తెలుపగలను,

ఒంతరితనపు ఎడారిలో ఒయాసిస్సు వయ్యావని,

అనుమానాల చీకటి అలుముకున్న నాకు అనుబంధాల వెలుగు వయ్యావని,

ఆప్యాయతలు పంచే అమ్మ వయ్యావని,

ప్రతిక్షణం ప్రాణంగా చూసుకునే ప్రాణమయ్యావని,

అన్నికలిసి నా మనసులో సుస్థిరస్థానం నిలుపుకున్న స్నేహాని వయ్యావని,

స్నేహమా ఎలా చూపగలను,

నీ రాకతో నా మనసుకు కలిగిన ఆనందాల అనుభూతిని,

మదిలో నీకోసం కట్టుకున్న స్నేహ కుటీరాన్ని.

గుండెలో భద్రంగా దాచుకున్నా నీ ప్రతిరూపాన్ని.

మాటల కందని మాధుర్యం నీవు,

మనసుని గెలుచుకునే మైత్రివి నీవు.