నేస్తమా ఎలా నీకు తెలుపగలను,

ఒంతరితనపు ఎడారిలో ఒయాసిస్సు వయ్యావని,

అనుమానాల చీకటి అలుముకున్న నాకు అనుబంధాల వెలుగు వయ్యావని,

ఆప్యాయతలు పంచే అమ్మ వయ్యావని,

ప్రతిక్షణం ప్రాణంగా చూసుకునే ప్రాణమయ్యావని,

అన్నికలిసి నా మనసులో సుస్థిరస్థానం నిలుపుకున్న స్నేహాని వయ్యావని,

స్నేహమా ఎలా చూపగలను,

నీ రాకతో నా మనసుకు కలిగిన ఆనందాల అనుభూతిని,

మదిలో నీకోసం కట్టుకున్న స్నేహ కుటీరాన్ని.

గుండెలో భద్రంగా దాచుకున్నా నీ ప్రతిరూపాన్ని.

మాటల కందని మాధుర్యం నీవు,

మనసుని గెలుచుకునే మైత్రివి నీవు.


5 comments:

padmarpita said...

"నీ స్నేహాన్ని" సదా నేను కోరుకుంటున్నాను నేస్తమా!

pavan said...

మరచిపోలేని స్నేహానివి నువ్వు,
మనసు చేరిన నేస్తానివి నువ్వు.
baagumdi neastam nee kavita

మాలా కుమార్ said...

happy friendship day

pavan said...

nice chala bagumdi, belated happy friendship day

VeNkaTesh said...

its heart touching brother

Post a Comment