జ్యొతివై నా చీకటి హృదయంలో వెలుగు నింపుతావనుకున్నాను,
కాని జ్వాలవై నా హృదయాన్ని మండిస్తున్నావు,
ఐనా ఆనందమే నీ చూపుల జ్వాలలలో మండుతున్నందుకు.

అలవై నా మనసుతీరం తాకుతావనుకున్నాను,
కాని కలవై నన్ను విరహసంద్రంలోకి తోసేశావు,
ఐనా ఆనందమే నీ మనసులోతు తెలుసుకుంటున్నందుకు.

నింగివై నీ ప్రేమ జల్లులలో నన్ను తడుపుతావనుకున్నాను,
కాని పిడుగువై నా గుండెని బూడిద చేశావు,
ఐనా ఆనందమే నీ కన్నుల కాంతిలో నా గుండె బూడిదైనందుకు.

ఊపిరివై నా గుండెలో నిండిపోతావనుకున్నాను,
కాని ఉప్పెనవై నామనసును నా నుండి దూరంగా తీసుకెళ్ళిపోయావు,
ఐనా ఆనందమే నన్ను వదిలిన నా మనసు నీతో వెళ్ళిపోయినందుకు.

భువివై నన్ను నీ ఓడిలో దాచుకుంటావనుకున్నాను,
కాని భూకంపమై నీ మాటల ప్రకంపనాలతో నా ప్రాణం తీశావు,
ఐనా ఆనందమే నేను మరణించినా నా తనువు నీలో ఐక్యమవుతున్నందుకు.

5 comments:

విశ్వ ప్రేమికుడు said...

very nice :)

Ravi said...

"పంచ భూతాల" సాక్షిగా మీ ఈ కవిత చాలా బాగుంది.

భావన said...

బాగుందండి మీ విరహ జ్వాలా కీల

sri said...

mi manasuloni aavedana ku aaradhana ku mi alochanalu chalaa baga jata chesaaru,,,its very nicee

మనసు said...

nice chalaa baagumdi, mee kavita pamcha bhuataalanu chaalaa bagaa use chesukunnaru

Post a Comment