నీ రాకతో గుండెలో ఏదో తెలియని అలజడి... నీ ప్రేమకై నా మనసు అడుగుల వడివడి....
నీ రూపులో నా చూపులు చిక్కుబడి....నీ ప్రేమలో పడిపోయింది నా ఎద తడబడి....
పరిచయ ప్రయత్నం భగీరధమే, ఫలించి మనసుని చేరింది నీ ప్రేమసాగరమే...
నీ తోడులో కరిగిన కాలం వసంతమే, నా హృదయతీరం చేరిన నీ ప్రేమలు అనంతమే...
నీ స్వరాల సంగీతంతో, గజ్జెలు కట్టి నాట్యం చేయును నా హృదయం...
నువ్వు పంచే ప్రేమతో, ఆనందపు అలలై ప్రవహించే నయనసంద్రం...
ఒక్కసారి నా చెయ్యి పట్టుకో....కొత్త జీవితానికై నీతో ఏడడుగులేస్తాను...
నా ప్రేమలో నీకొక్క కన్నీటిచుక్క రాలినా, మరుక్షణం నా ప్రాణాలు వదిలేస్తాను...

5 comments:
chaalaa baavundi
nice..
chala bagundi.
Nice one!
నందన నామ ఉగాది శుభాకాంక్షలండీ:)
నా ప్రేమలో నీకొక్క కన్నీటిచుక్క రాలినా, మరుక్షణం నా ప్రాణాలు వదిలేస్తాను చక్కని భావం ఎంత బాగా చెప్పారండీ! అద్భుతం! నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
నా ప్రేమలో నీకొక్క కన్నీటిచుక్క రాలినా, మరుక్షణం నా ప్రాణాలు వదిలేస్తాను...
ee line chala bagumdi andi...... too gud.....
Post a Comment