కొంటెనవ్వుతో చూసే ఓరకంటిచూపులు
ఉలిక్కిపడి నిదురలేచిన ఆశలు.

దూరమయ్యే నీ మువ్వలచప్పుళ్ళు,
ఆగిపోతున్న నాగుండె చప్పుళ్ళు.

కనుమరుగవుతున్న నీ ప్రతిరూపం,
కనులకు అది కన్నీటి శాపం.

అస్తమిస్తున్న నీ కనుల అరుణాలు,
నా మనసుకి చీకటితోరణాలు.

ఏకాంతంలో కదలాడే నీ తియ్యని జ్ఞాపకాలు,
చెంతలేవని గుండెకుచేసే గాయాలు

నీకై ఎదురుచూసే నా  తడి నయనాలు,
మనోరుధిరం నింపుకున్న ఎరుపుచారలు.

8 comments:

'Padmarpita' said...

nice.....

కెక్యూబ్ వర్మ said...

beautiful....

పరిమళం said...

Beautiful!

nedunuri said...

చాలా బాగుంది.మీ కవిత మీ మనసులొ కురిసిన వెన్నెల జల్లు అందరి పైన చిలకరించి నందుకు హేట్సాఫ్.

చిన్ని said...

చాల బాగుంది .

Anonymous said...

simply superb
nari

Balu said...

beauty

రసజ్ఞ said...

అస్తమిస్తున్న నీ కనుల అరుణాలు,
నా మనసుకి చీకటితోరణాలు.

బాగా నచ్చాయి!

Post a Comment