ప్రేమాభిమానాలు లేక ఎడారైంది నా గుండె,

అలాంటి నాకు నీ ఎడబాటుతో నా కంటి నుండి నీ కోసం ఒక కన్నీటి చుక్క నేల రాలింది,

అప్పుడు గాని తెలియలేదు నీ ప్రేమ సముద్రం నా గుండెలొ వున్నదని,

నీకోసం జారుతున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు నన్ను ప్రశ్నిస్తున్నాయి,

ఎప్పుడు నిన్ను నేను కలుస్తానని, ఎప్పుడు ఈ ప్రవాహన్ని నీ ప్రేమతో ఆనకట్ట వేస్తానని.

మౌనాన్ని వాటికి సమాధానంగా తెలియజేసాను,

ఎక్కడని వెతకాలి ప్రియతమా నీ జాడకోసం,

నిన్ను నాగుండెలొ దాచుకున్నాననుకున్నాను,

కాని నా గుండెనే చీల్చి నువ్వెళ్ళిపొయావని తెలుసుకోలేకపొయాను,

ఐనా నీ మీద ప్రేమే కాని ద్వేషం లేదు,

నీ ప్రేమప్రాయాణంలో వున్న ఈ బాటసారికి గమ్యం తెలుపలేవా?

0 comments:

Post a Comment