నిన్న నీ గురించి కలలు,

నేడు నీ గురించి ఆలోచనలు,

రేపు నీ గురించి ఆశలు,

అన్ని రోజులు నీ గురించే

వర్షాకాలం నీ ఉహలతొ తడిసిపొతున్నా,

ఎండాకాలం నీ జ్ఞాపకలతొ ఆవిరైపొతున్నా,

చలికాలం నీ ఆలొచనలతొ వణికిపొతున్నా,

అన్ని కాలాలు నీ గురించే,

ఆ నింగిలొను నీ రూపమే,

ఆ నీటిలొను నీ అందమే,

ఈ నేలలొను నీ గుర్తులే,

అన్నింటా నువ్వే, అంతటా నువ్వే,

మరి నేనెక్కడున్నానా అని వెతికాను

అప్పుడు తెలిసింది నేను నీ మనసులొ వున్నానని.

0 comments:

Post a Comment