నీ పరిచయం నాకు ప్రేమను నేర్పించింది

నీ అందం నాకు బంధం వేసింది

నీ మాటలు నా ప్రేమకు బాటలు వేశాయి

నీ నవ్వులు నన్ను మైమరపించాయి

నీ చూపులు నా గుండెను తాకాయి

నీ అభిమానం నీ పై నా ప్రేమను పెంచాయి

నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని

కాని అది నీకు తెలియాలంటే ఎలా

నీకు అనందం కలిగినప్పుడు నన్ను హత్తుకుంటావు చూడు అదే ప్రేమ

నీవు ఒంటరిగా వున్నప్పుడు నన్ను తలచుకుంటావే అదే ప్రేమ

నేను కనబడనప్పుడు నా సెల్లులొ మెసేజ్ బాక్స్ నిండిపొతుంది చూడు నీ మెసేజ్ లతొ అదే ప్రేమ

నేను ఏ అమ్మయితొ ఐనా మాట్లడుతుంటే నీ కళ్ళు ఎరుపెక్కుతాయే అదే ప్రేమ

పొద్దున్నే నా మెసేజ్ రాకపొతే నువ్వు నన్ను తిడతవు చూడు అదే ప్రేమంటే

ఇంకా అర్ధంకాలేదా నీకు ప్రేమంటే

ఏ బాషలొ చెప్పాలి నీకు

కనీసం నీ మనసు నన్న అడిగి చూడు

నా మనసు పడే బాదేమిటో

0 comments:

Post a Comment