మేము అనాధలము,

చిన్నప్పుడు ఆకలేస్తే పాలు పట్టటానికి అమ్మ లేదు,

నడకలు నేర్పటానికి నాన్న లేడు,

ఆదరించే బందువులు లేరు,

అభిమానించే ఆత్మీయులు లేరు,

దాహం తీరటానికి కన్నీళ్ళే నీరయ్యయి,

ఆకలి తీర్చటానికి పాచన్నమే పరమాణ్ణమైంది.

తినటానికి, తాగటానికి ఏమి లేకపొయినా, ఆశలు మాత్రం మనసు నిండా ఉన్నాయి.

అమ్మ ఒడిలొ నిద్ర పోవాలని,

నాన్న చేతులు పట్టుకు నడవాలని,

అందరిలా చదువుకోవాలని,

ఆనందంగా గడపాలని, కాని

చీకటిరోడ్డులే తల్లి ఒడి అయ్యాయి,

ఆకలి బాధలే నడక నేర్పాయి,

చిత్తు కాగితాలే చదువునేర్పాయి,

కడుపు నిండటమే ఆనందమైయ్యింది

ఎవరి పాపమో మా జన్మగా మారి శాపమైంది,

వాళ్ళ క్షణికావేశంతొ మా జీవితం దౌర్భాగ్యమైంది.

ఎన్నొ రోజులనుండి ఎదురుచూస్తున్నా మా జీవితాలు మార్చటానికి ఎవరైనా వస్తారేమో అని.

ఆశలు ఆవిరయ్యాయి,బ్రతుకులు కన్నీటిమయమయ్యాయి.

0 comments:

Post a Comment