నిన్ను చూస్తే మనసులొని మాటలు గొంతు దాటి బయటకు రావటం లేదు,

ప్రేమించే వాళ్ళు బయపడరు కదా మరి నాకెందుకు నీతొ మాట్లాడటానికి ధైర్యం రావటం లేదు,

గొంతు మూగబొతుంది,

మాట తడపడుతుంది,

చేతులు వణకుతున్నాయి,

మన మద్య వున్న ఈ మౌనమనే సముద్రాన్ని ఎలా దాటాలి,

పోని నా ప్రేమతొ ఆ ఇంద్రధనస్సుని వంతెన చేసి ఆ చిరుగాలిని నా ప్రేమకు రాయబారిగా పంపిస్తాను,

అప్పుడన్నా నీ మనసు కరిగి నీ మాటల జల్లులు నా మనసుని తడుపుతాయేమొ చూడాలి.

లేకపొతే నా మనసు నీ ప్రేమదాహం తీరక ఎండిపొతుందేమో?

ప్రేమలొ పడ్డాక కాని తెలియలేదు,

అది మనసుని బాద పెట్టే తియ్యని బాధ అని,

మన కష్ట,నష్టాలను పంచుకునే ఒక బంధమని.

0 comments:

Post a Comment