ఎందుకు నాకు పరిచయమయ్యాయు,

ఎందుకు నాలొ ఆశలు రేపావు,

నీ చిన్ని చిన్ని పదాలతొ నా మాటలకి బంధం వేశావు,

కవితలే కదా పంపుతున్నాను అనుకున్నా ఇన్నాళ్ళు,

నా మనసుని నీకు ఇచ్చేస్తున్నాను అని తెలుసుకోలేకపొయా,

తెలుసు కున్నాక నీగురించి ఆలొచనలు,

నన్ను నేను మర్చిపోతున్నాను,

నిన్ను నాలొ కలుపుకుంటున్నాను,

ఎవరు నీవు ఎందుకిలా నన్ను వేధిస్తున్నవు,

తప్పు నాదే నిన్ను పరిచయం చేసుకున్నాను కదా,

స్నేహానికంటే ఎక్కువగా ఎదొ తెలియని అనుభూతి,

నీ స్చ్రాప్ కోసం రోజు ఎదురు చూస్తుంటాను,

నా కోసం కాకపొయినా కనీసం నా మనసు కోసమన్నా రోజు స్చ్రాప్ చేస్తుండు,

కాలాన్ని పరుగెత్తిస్తున్నాను,

రేపటి కోసం నీ సందేశం కోసం,

రోజులు గడుస్తున్నా ఇంకా నీ గురించి నాకేమి తెలియదు,

అప్పుడప్పుడు అడగాలని ఉన్నా నన్ను నువ్వు తప్పుగా అనుకుంటావని ఆగిపొతున్నాను,

కాని ఇప్పుడు నా వల్ల కావటం లేదు, నా మనసు నన్ను ఎదురించి తన భావాలని నీతొ పంచుకుంటుంది.

నీ ప్రొఫైల్ చూశాను నీ మనసు నాకు నచ్చింది,

అందుకే దైర్యం చేసి వ్రాస్తున్నాను నా ఈ తియ్యనిబాధ గురించి.

తప్పుని మన్నించు, తప్పక ఆలోచించూ.

నీ గొంతు విని, నా మనసుకి కొత్త వసంతం రావాలని ఆశతో......................

0 comments:

Post a Comment