నీవు వదిలి వెళ్ళి వారమైనా కాలేదుకదా కాని,

మనసు నీ ప్రేమలేక ఓంటరైయ్యింది, గొంతు నీ మాటలేక మూగబొయింది,

నీ రూపులేక నా కళ్ళు చీకటయ్యాయి,

ఇన్నాళ్ళు నీ దగ్గర వున్నంత కాలం నాకు తెలియలేదు ఇది ప్రేమని,

నువ్వు దూరమైన క్షణాలన్నీ కన్నీళ్ళుగా మారాయి,

నీకోసం నే కార్చిన కన్నీటిబొట్టు ఒక్కొక్కటే నన్ను నీ తలపులలొ ముంచేస్తుంది.

నీవు లేని ఈ విరహం నాకు నరకంలా వుంది,

నిన్ను త్వరగా చేరాలని నీ కౌగిలిలో నేను ఓదిగిపొవాలని ఏవొ ఆశలు,

త్వరగా రావా ప్రియతమా నాకోసం మన ప్రేమ కోసం.

నీకోసం కన్నీటి కళ్ళతో ఎదురుచూస్తూవుంటాను.



1 comments:

Anonymous said...

చాలా బాగుంది మీ కవిత, చాలా సరళంగా వుంది

Post a Comment