నీ ప్రేమకోసం నేను పడిన వేదన,

నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,

నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ,

నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,

దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులోను ఆనందమే,

నీవు చెంతనున్నా ఇంత ప్రేమ కనిపించదేమో,

నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,

నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,

నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,

నీ ప్రేమ దొరకకముందున్న నాప్రేమ అనంతం,

అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,

ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,

కాని ప్రేమ దొరికిన తర్వాతా ప్రేమ మాయమవుతుంది,భాధ్యత ప్రారంభమవుతుంది.

అందుకే నన్ను ప్రేమించకు ప్రియతమా.

2 comments:

హరే కృష్ణ said...

యుక్త వయసులో ప్రేమ వల్ల వినాశనాలు జరగడమే ఎక్కువ ..
అన్నిటికంటే గొప్పదైనది తల్లి ప్రేమ

పరిమళం said...

"నీ ప్రేమ దొరకకముందున్న నాప్రేమ అనంతం"
అవును ఒకరిని ప్రేమిస్తున్నామనే భావన మనసును స్వార్ధ పూరితం చేస్తుంది .అనంతమైన ప్రేమను ఒకరికే అంకితమివ్వాలనిపిస్తుంది....బావుందండీ ...మీ కవిత !

Post a Comment