చిరుజలల్లుల చిరునవ్వులతో నన్ను తడిపేస్తున్నావు

చురుకైన చూపులతో నా హృదయన్ని గుచ్ఛేస్తున్నావు,

కొకిల స్వరంతో మైమరపిస్తున్నావు,

తియ్యనైన మాటలతో ఆకట్టుకుంటున్నావు,

మరి ప్రేమిస్తునానంటే వద్దని ఎందుకు వేధిస్తునావు,

ఎవరో గుండెను పిండేస్తున్నట్లుంది,

మనిషివి దగ్గరగా ఉండి మరి మనసుకి దూరాన్ని పెంచుతున్నావే,

ఎలా నీకు నా ప్రేమను వ్యక్తం చెయ్యగలను?

రవిని కాను కిరణమై నీ మనసులో ప్రవేశించటానికి,

కవిని కాను కవితనై నీ మదిలో నిలిచిపొవటానికి,

ప్రాణం కూడ తృణమే నువ్వు లేనప్పుడు

మరణం కూడా ఆభరణమే నువ్వు ప్రేమిస్తానన్నప్పుడు.

4 comments:

pavan said...

రవిని కాను కిరణమై నీ మనసులో ప్రవేశించటానికి,

కవిని కాను కవితనై నీ మదిలో నిలిచిపొవటానికి,

ఈ లైన్లు చాలా బాగున్నాయి, చాలా బాగా రాశారు.

హను said...

మీ ప్రోత్సాహమే నాకు అండాదండా

Nestam said...

ఎవరో గుండెను పిండేస్తున్నట్లుంది,
ee line lekunda unte bavundedi.
nice.

శిశిర said...

"ప్రాణం కూడ తృణమే నువ్వు లేనప్పుడు
మరణం కూడా ఆభరణమే నువ్వు ప్రేమిస్తానన్నప్పుడు"

చాలా బాగుంది.

"చిరునవ్వుల వరమిస్తావా చితినుంచీ లేచొస్తా
మరుజన్మకి కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తా "

కవి ఎవరైనా భావం ఒకటే కదా.
ప్రేమలోని తీవ్రతే అంత అనుకుంటాను.
మీ వ్యక్తీకరణ చాలా బాగుంది.

Post a Comment