నేను నీకు ఎంత చేరువలో ఉంటానంటే,

జారే కన్నీటిబొట్టును తుడిచేటంత చేరువలో,

నా గుండె చప్పుడు నీకు వినబడేంత చేరువలో,

నా ప్రతిబింబం నీ కంటిపాపలో కనబడేటంత చేరువలో,

నా ప్రతిమాటా నీ మనసుకి చేరేంత చేరువలో,

నీ నీడతో కలిసి నా నీడ నడిచేటంత చేరువలో,

నీకు తోడుగా నీ చెయ్యి పట్టూకోని నడిచేటంత చేరువలో.

మనసుకి మంత్రం వేసి నన్ను నీవాడిని చేసుకున్నావు,

ప్రేమను ప్రాణంగా పోసి నన్ను బ్రతికిస్తున్నావు,

నీ రాకతో నా జీవితానికి వసంతం వచ్చిందనుకున్నా,

అనురాగాలు పంచే అర్దాంగి అవుతానన్నావు,

కాని ఒంటరితనం అనే అగాతంలొకి తోసేసి మాయమయ్యావు,

నన్ను ఒంటరిని చేసి నువ్వు ఇంకోకరి జంట అయ్యావు,

నా మనసుని చంపి నీ ప్రేమను ఇంకోకరికి పంచటానికి సిద్దమయ్యావు,

తనతో నడిచిన ఏడడుగులుతో నాకు జీవితమంతం దొరకనంత దూరం వెళ్ళిపొయావు.

నాకు వేదన మిగిల్చి తనకు ఆనందాన్ని పంచుతున్నావు.

నువ్వు మనుషుల మనసుతో వ్యభిచారం చేస్తున్నావు.

నన్ను అభాగ్యుడిగా వదిలేసి తనకు అర్ధాంగి అయ్యావు.


తడిచే వృక్షానికి తెలియదు ఆ వర్షానికి కారణం తానేనని,

ఆహ్లాదించే నీ మనసుకి తెలియదు ఆ ప్రేమకు కారణం నేనేనని.

మౌనమనే అస్త్రంతో నా మనసుకి గుచ్ఛావు,

ప్రేమలేని ఎడారిలో నన్ను వదిలేశావు,

నా ప్రేమదాహం ఎలాగు తీర్చలేవు,

కనీసం నీ చిరునవ్వుల ఒయసిస్సులన్నా అప్పుడప్పుడు పంచు,ఆనందంగా బ్రతికేస్తాను.

అలుపురాని కెరటాంలా నీ మనసు తీరం చేరటానికి ప్రయత్నిస్తున్నాను,

గెలుపుకోసం పోరాడే ప్రత్యర్దిలా నీ ప్రేమను గెలుచుకోవటానికి ప్రయత్నిస్తున్నాను,

నీ తలపులు తీరం చేరలేదన్న బాధను తగ్గిస్తున్నాయి,

నీ చూపులు ఏ రొజుకన్నా గెలుస్తానన్న నమ్మకాన్ని ఇస్తున్నాయి.


ఘడియ చాలు నీ గుండె సవ్వడి తెలుసుకోవటానికి,

క్షణము చాలు నీ కంటిపాపలో నన్ను చూసుకోవటానికి,

కాని జీవితం కూడా సరిపోదు నా వేదన వ్యక్తం చెయ్యటానికి,

యుగము కూడా సరిపోదు నా ప్రేమను నీకు పంచటానికి.

జతచేరిన బంధమేదో జీవితమయ్యింది,

మనసులొని ప్రేమను పంచే తరుణమయ్యింది,

నీ చూపుల ప్రేమాభావం నా మనసుని తాకింది,

నా మనసులోని ప్రేమజ్యొతి నీగుండెలో ఐక్యమయ్యింది.

పల్లవినై నీ పాటకి ప్రాణమవుదామనుకున్నాను,

కాని నీ ప్రేమతో నా మాటలు మూగబొయి మౌనరాగంగా మిగిలిపొయాను.

నీ ప్రేమకోసం నేను పడిన వేదన,

నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,

నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ,

నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,

దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులోను ఆనందమే,

నీవు చెంతనున్నా ఇంత ప్రేమ కనిపించదేమో,

నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,

నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,

నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,

నీ ప్రేమ దొరకకముందున్న నాప్రేమ అనంతం,

అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,

ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,

కాని ప్రేమ దొరికిన తర్వాతా ప్రేమ మాయమవుతుంది,భాధ్యత ప్రారంభమవుతుంది.

అందుకే నన్ను ప్రేమించకు ప్రియతమా.

నువ్వు దూరమవుతుంటే కన్నీళ్ళు ఆగనంటున్నాయి,

కాని నాకు దూరమవుతున్న నీ కళ్ళలో కన్నీరు చూసినప్పుడు,

నాకోసం బాధపడే ఒక మనసుందని తెలిసినప్పుడు,

ఎలా నా ఆనందాన్ని వ్యక్తం చెయ్యగలను,

నీ బాధలో నా మీద ప్రేమను చూసుకున్నాను,

చాలు నాకోసం నువ్వు జార్చిన ఒక్క కన్నీటిబొట్టు చాలు,

ఇంక నా ప్రేమను నీ కన్నీటి నుండి బయటకి రానివ్వను.

గళమెత్తి చాటుతాను నా భరతమాత కీర్తిని,

చేతులెత్తి మొక్కుతాను నా మాతృభూమి ప్రఖ్యాతికి,

నెత్తి మీద మంచుకుండ పెట్టుకున్న పల్లె ఆడపడుచులా,

చుట్టూతా నీటిని నింపుకున్న తామరపువ్వులా,

మతాలని,కులాలని ఒక్కబిడ్డలుగా ఐక్యం చేసిన తల్లిలా,

తన బిడ్డకోసం (కాశ్మీర్) పోరాడే సైనికురాలిగా,

నదులను గుండెలో దాచుకున్న పుణ్యమూర్తిలా,

ప్రతి రైతుకి తిండిపెట్టే తల్లిలా,

ప్రతిమనిషికి చోటునిచ్చే దేవతలా,

ఎన్నొ సేవలు చేసింది నా దరియిత్రి భారతి,

నీకొసం ప్రాణమైనా ఇస్తాము హారతి.

గడిచిపొతున్న గడియలన్ని జ్ఞాపకాల మాలలవుతున్నాయి,

నా మనసులొ ఒక్కొకటిగా గుచ్ఛుకుంటున్నాయి,

ఎగసిపడే కెరటంలా ప్రతిరోజు నిన్ను చేరుకుంటున్నాను,

నీరాశతో తిరిగి వెనక్కి వెళ్ళిపొతున్నాను,

నీ అంగీకారం దొరకక,

పంజరంలో ఉన్న పావురంలా ఉంది నా ప్రేమ.

బయటకి రావాలని నీ మనసుని చేరాలని ఎదురుచూస్తుంది,

సరస్వతీ పుత్రికవైన నీకు,

నా చూపుల భాష తెలియటం లేదా?

లేకపొతే ప్రేమలేక నీ మనసు శిలైపొయిందా?

చెప్పకొటానికేముందని చెప్పమంటారు నా గురించి,

అచ్ఛమైన తెలుగువాడిని,

కాలేజీలో చదవే స్తోమతలేక జీవితాన్ని చదువుతున్న విధ్యార్దిని,

కాలే కడుపుకోసం పని చేస్తున్న కార్మికుడిని,

ఏన్నో చెయ్యలనుకుని ఏమిచెయ్యలేని ఆశాపరుడిని,

నమ్మకాన్ని మాత్రమే పంచగల ఆత్మీయుడిని,

తల్లిదండ్రులని సంతోషపరచలేని తనయుడిని,

ప్రేమకొసం బయలుజేరిని బాటసారిని,

అందరూ నాతో స్నేహం చెయ్యలనుకునే స్వార్దపరుడిని,

ఆకలి మంటలు తీర్చాలనున్న తీర్చలేని దరిధ్రుడిని,

ఏమి లేకపొయినా సంస్కారం మాత్రం తెలిసిని భారతీయుడిని.

చిరుజలల్లుల చిరునవ్వులతో నన్ను తడిపేస్తున్నావు

చురుకైన చూపులతో నా హృదయన్ని గుచ్ఛేస్తున్నావు,

కొకిల స్వరంతో మైమరపిస్తున్నావు,

తియ్యనైన మాటలతో ఆకట్టుకుంటున్నావు,

మరి ప్రేమిస్తునానంటే వద్దని ఎందుకు వేధిస్తునావు,

ఎవరో గుండెను పిండేస్తున్నట్లుంది,

మనిషివి దగ్గరగా ఉండి మరి మనసుకి దూరాన్ని పెంచుతున్నావే,

ఎలా నీకు నా ప్రేమను వ్యక్తం చెయ్యగలను?

రవిని కాను కిరణమై నీ మనసులో ప్రవేశించటానికి,

కవిని కాను కవితనై నీ మదిలో నిలిచిపొవటానికి,

ప్రాణం కూడ తృణమే నువ్వు లేనప్పుడు

మరణం కూడా ఆభరణమే నువ్వు ప్రేమిస్తానన్నప్పుడు.

నేలపై పడుతున్న ప్రతి కన్నీటిబొట్టు నీ ప్రేమకి జ్ఞాపకమే,

నీ తలపులలో జీవించటం నాకు వ్యాపకమే,

నా కనుపాపలో నీ రూపమే,

నా ప్రతిశ్వాస నీ ప్రేమకి ప్రతిరూపమే,

నేను మాట్లాడే ప్రతిమాట నీ ప్రేమరాగమే,

నా ఆనందానికి కారణం నీ అనురాగమే,

నన్ను వదిలి స్వప్నమయ్యావు ,

నా గుండెలో చేరి సర్వమయ్యావు.

నా ప్రేమకి రూపం నువ్వు,

నా మనసుకి అపురూపం నీ నవ్వు.


ఏమని సమాధానం చెప్పను,

సాగరతీరంలొ ఒంటరిగా నడుస్తున్న నన్ను చూసి కెరటాలు ప్రశ్నించాయి,

నీతో నడిచే నీ తొడు ఏమయిందని,

సాయంసంధ్యవేళ అస్తమించే సూర్యుడు అడిగాడు,

నీ వెన్నెల కనిపించటంలేదేంటని,

నిన్ను వెతికే నా కళ్ళు అడిగాయి,

నీ మనసు దోచిన అందమేదని,

నాతో నడిచే నా నీడ అడిగింది,

తనతో నడిచిన తొడు ఏమయిందని?

ఏలా సమాధానం చెప్పను వాటికి,

కన్నీళ్ళను కానుకగా వదిలి తను వెళ్ళిపొయిందనా?

గుండెలొ మంటరేపి వెళ్ళిపొయిందనా?

మనసును ఒంటరిని చేసి వెళ్ళిపొయిందనా?

నన్ను కాదని లోకం వదిలి వెళ్ళిపొయిందనా?

ఏమని చెప్పను తను శ్వాస వదిలి నా మనసుని తీసుకెళ్ళిపొయిందనా?

మూగబొయిన మనసులో మాటలు మాయమయ్యాయి.

మౌనమే సమాధానం అయ్యింది.



హృదయాంతరాలలొ నిండిన ప్రేమనడుగు?

నీ ప్రేమజ్యోతి కోసం వెతికే నా కళ్లగురించి,

రగిలి పొతున్న నా మనసునడుగు?

వెన్నెల కన్న చల్లనైన నీ అనురాగంకోసం వెతికే నా ప్రేమగురించి,

నీ వాడి(వేడి) చూపులలొ కాలిపొతున్న నా హృదయాన్నడుగు?

ప్రతిక్షణం నీవెంటనడిచే నా నీడ గురించి.

ఆగని నా కన్నీటినడుగు?

నీ ప్రేమసముద్రాన్ని నింపుకున్న నా మనసుగురించి,

నువ్వు రోజు తిరిగే దారినడుగు?

నీవెనక నడిచే నీతోడు (నా) గురించి

చివరికి నన్ను వెతికే నీ కళ్ళనడుగు?

నీ మనసులొ నాపై పెంచుకన్న ప్రేమగురించి.

అప్పుడే పుట్టిన ఆడపిల్లకే మాటలొస్తే తన మనసులోని మాటలు ఇలా చెబుతుంది,

ఏమయ్యిందని మీకు నిరుత్సాహం,

ఆడపిల్లగా పుట్టటమే నేను చేసిన నేరమా?

ఒకసారి ఆలొచిచూ ఆడదే లేకుండా నీ జీవితం ఎమన్నా వుందా?

నిన్ను కన్నది ఒక ఆడదే,

తల్లి పాలుత్రాగి ఇప్పుడు ఆడపిల్లనే చంపాలనుకున్నవు,

పాలుపోసిన యజమానినే చంపిన పాములంటివాడివి నువ్వు,

నిన్ను పెంచటానికి ఆడది కావాలి,

నీకు సేవలు చెయ్యటానికి ఆడది కావాలి,

నీ కొర్కెలు తీర్చటానికి ఆడది కావాలి,

పుట్టినప్పటి నుండి చచ్చే దాక ఆడది నీకు తొడు కావాలి,

ఆలాంటిది నీకు ఆడపిల్ల పుడితే చంపేస్తానంటావా?

కడుపులొ బిడ్డను కడుపులో ఉండగానే చంపానుకున్నవు,

భగవంతుడా ఇలాంటి తండ్రికి పుట్టటం కన్న మరణమే మేలు స్వామి,

మేల్కొండి ప్రజలారా ఆడదంటే అలుసు వద్దు,

ఆడపిల్లలని ఆదరించడి,

నాలా కాకుండ మిగతా వారినన్న బ్రతకనీయండి,

ఐనా ఆడపిల్లలని అవహేళనగా చూసే లోకంలొ పుట్టనందుకు నాకు చాలా ఆనందంగా వుంది.

ఓటమి అంటే ఆగాని పాయనం అని ఆర్దం ,

గెలుపు నిన్ను అక్కడే ఆపేస్తుంది,

ఒక్కసారి ఆలోచించూ, కొంచెం బాదగా వున్నా మళ్ళీ నువ్వు ప్రయత్నిస్తుంటావు,

ఓటమిలో కసి వుంటుంది, గెలవాలన్న తపన ఉంటుంది,

కాని గెలుపులో ఆనందం తప్ప ఏం ఉండదు,

కాని ఒక్కసారి గెలుపు నిన్ను వరించిందంటే ఇక నువ్వు ముందుకు కదలటానికి ఏమి ఉండదు,

కాని ఒటమి నిన్ను గెలవాలని ముందుకు పంపిస్తుంటుంది.

ఇది జీవిత సత్యం నేస్తమా. అందుకే ఓడిపోయానని బాధపడకు,

మరోసారి ఆవకాశం వచ్చిందని ఆనందించూ.

నీ కన్నీటిని ఆనందభాష్పాలుగా మార్చుకో.

నా మనసు బయలుజేరింది,

నన్ను నన్నుగా కాకుండా తనలొ కలుపుకునే నా ప్రియురాలికోసం,

నా మోడుబారిన గుండెకి తన మాటలజల్లులతో ప్రాణంపొసే ప్రియురాలికోసం,

చీకటి అలముకున్నా నా మనసుకి ఆప్యాయతల వెలుగుని ప్రసాదించే నా సుందరికోసం,

ఒంటరిగా గడిచిపొతున్న నా జీవితంలొకి ప్రవేశించే నా ప్రియసఖికోసం,

నిన్నటి జ్ఞాపకలలోనే బ్రతుకుతున్న నాకు భవిష్యత్తు చూపే ప్రేమికురాలికోసం,

స్వార్దం,అసూయా అనే సంద్రాలమద్యలో వున్న నన్ను చెయ్యి పట్టుకోని ఒడ్డుకి చేర్చే నా హృదయరాణికోసం,

అనురాగం కరువై వుక్కిరిబిక్కిరవుతున్న నాకు,చిరునవ్వుల చిరుగాలులను వియించే నాప్రాణంకోసం,

కళ్ళతో వెతికాను ఇన్నాళ్ళు మనసుతో వెతకాలని తెలియక,

నా మనసు ప్రయాణం ప్రారంభించింది తన ప్రేమకోసం,

ఆ ప్రేమను పంచే మనిషి కోసం.


వెలయాలి అని అంటున్నారు అందరు నిన్ను ఐనా నీ మోములో చిరునవ్వు.

అది నీ గుండెలొ నుండి వచ్చిందికాదని నీ కళ్ళలొ తెలుస్తుంది,

ప్రపంచలో ప్రతిఒక్కరు వ్యాపారం చేస్తున్నారు,

మనిషి తన కష్టాన్ని అమ్ముకుంటున్నాడు ఉద్యోగం చేస్తూ,తన భార్యా,పిల్లాలని పొషించే డబ్బుకోసం,

ఒక రిక్షావాడు తన బలాన్ని అమ్ముకుంటున్నడు డబ్బుకోసం,

ఒక మేస్త్రి తన పనిని అమ్ముకుంటున్నాడు డబ్బుకోసం,

ఒక ఇంజనీరు తన తెలివితేటలు అమ్ముకుంటున్నాడు డబ్బుకోసం,

ఒక మాష్టారు తన చదువుని అమ్ముకుంటున్నాడు డబ్బుకోసం,

ఒక డాక్టరు తన వైద్యాన్ని అమ్ముకుంటున్నాడు డబ్బుకోసం,

ఒక లాయరు తన న్యాయవిధ్యను అమ్ముకుంటున్నాడు డబ్బుకోసం,

డబ్బు,డబ్బు,డబ్బు ఎవరైనా,ఎమైనా చేసేది ఈ డబ్బు కోసమే,

మరి అలాంటిది ఒక ఆడది తన శరిరాన్ని అమ్ముకుంటే మాత్రం తను చేసేది తప్పు,

ఎందుకి వ్యతాసం, ఎందుకు అందరూ తనని వెలయాలి అని నిందిస్తారు,

శరిరాన్ని అమ్ముకున్న ఆడదన్ని వెలయాలి అని అంటే,

అదే డబ్బు(కట్నం)కోసం తన శరిరాన్ని అమ్ముకున్న మగాడిని ఏమనాలి,

తన బిడ్డల లేక తన కడుపు నింపుకోవటానికి తన రక్తమాంసాల దేహాన్ని నీకు అమ్ముతుంది,

తను క్షణక్షణం క్షీణిస్తూ నీకు స్వర్గాన్ని అందించిన ఆ స్త్రీ ఇప్పుడు నీకు వెలయాలిలా కనిపిస్తుందా?

ఇంకోక్కసారి వెలయాలి అన్న ప్రతిఒక్కరిని వెలేయ్యాలి.

నాన్న ఈ మాటకి అర్దంకూడ నాకు సరిగా తెలియదు నాకు,

నాన్న ఎవరు ఈ నాన్న,

ఇప్పుడు వచ్చి నేను మీ నాన్ననని అంటూన్నాడు,


చిన్నతనంలో నేను ఒంటరిగా నడక నేర్చుకుంటన్నప్పుడు రాలేదు,

సైకిలు నేర్చుకుంటూ పడ్డప్పుడు పట్టూకొవటానికి రాలేదు,

నాకు చదువునేర్పించటానికి అమ్మ కష్టపడుతున్నప్పుడూ రాలేదు,

ఒంటరిగా కూర్చోని అమ్మ కన్నీళ్ళుపెడుతున్నప్పుడు ఆ కన్నీళ్ళు తుడవటనికి రాలేదు,

భయమేస్తే ఓదార్చటానికి రాలేదు,

స్కూలుకి పేరెంట్స్ మీటింగుకీ రాలేదు,

కట్టుకున్న భార్యని, కన్న పిల్లలని వదిలి కామంతో ఇంకోకరి దగ్గరకి వెళ్ళీపొయిన నువ్వు

ఇప్పుడు నీ వృదాప్యంలో సంపాదించూకునే శక్తిలేక మీకోక తోడూ కావలసివచ్చి,

నేను నీ తండ్రినని కన్నకోడుకుకే చెప్పుకునే దుస్తితికి చేరిన నిన్ను ఎలా నా తండ్రిగా స్వీకరించాలి?

ఇప్పుడు కూడ నిన్ను చూడగానే అమ్మ కళ్ళలో ఆనందం,

ఇన్నాళ్ళు నువ్వు వదిలి వెళ్ళావన్ని వచ్య్హిన కన్నీళ్ళన్నీ ఒక్కసారిగా ఆనందభష్పాలుగా మారిపొయాయి,

నాఅన్న వాళ్ళలొ నాన్న లేడు,

నాన్న ఈ పిలుపు నా నోటనుండి ఏ రోజు రాలేదు, ఇక ఏరొజు రాదు.