నీశీదిలో కదిలే మేఘనికి తెలుసు నీటి బరువు,

నామదిలో మెదిలే ప్రేమకు తెలుసు కన్నీటి బరువు.

నిన్ను ప్రతిబింబంగా మార్చి నా కనుపాపలో దాచుకున్నాను,

కాని నా మనసుకి గాయం చేసి కన్నీరుగా మారి జారిపోయావు.

ప్రేమను పంచుతానంటే నమ్మనంటున్నావు,

ప్రాణం అర్పిస్తానంటే నవ్వుకుంటునావు,

నా ప్రేమ విలువ నీ చిరుకోపమా?

లేక నా ప్రాణం విలువ నీ పరిహాసమా?

2 comments:

పరిమళం said...

"నా ప్రాణం విలువ నీ పరిహాసమా?"
కాదు కాదు తన ధరహాసం!

...Padmarpita... said...

మీ ప్రియురాలు అంత కఠినమా?

Post a Comment