నాకోసం వెతకటమే తెలుసు నీ కళ్ళకి,

కాని ఆ కళ్ళలొ ప్రేమను ఆశ్వాదిస్తున్న నా చూపులు తనకి కనబడవు.

నావెంట నడవటమే తెలుసు నీ పాదాలకి,

కాని ఆ పాదాలు కందకూడదని పూలమార్గం వేసింది నేనేనని తెలియదు వాటికి.

నా చిరునవ్వులలో ఆనందం వెతకటమే తెలుసు నీ చూపులకి,

కాని నీకు ఆనందన్ని అందించటానికి నా చిరునవ్వులు చిందిస్తున్నాని తెలియదు వాటికి.

నా ప్రేమను పొందడానికి ఆరాటపడడమే తెలుసు నీకు,

కాని నీ ప్రేమను పొందాలని ఆవేదన పడుతున్న సంగతి తెలియదు నీకు.

మాటలు చెప్పాలనే తెలుసు నీ గుండెకి,

కాని నీ మౌనం నన్ను బాధిస్తున్నదని తెలియదు నీకు.

ప్రేమను పంచాలనే తెలుసు నీ మనసుకి,

కాని నీ ప్రేమను పొందాలని ఆశపడుతున్న నా మనసు వేదన తెలియదు నీకు.

నా మౌనాన్ని పోగరనుకున్నావు,

కాని నా చూపుల మాటలను వినిపించుకోలేక పోయావు.

మగువ మనసుని చదవలేని మాగాడివయ్యావు నువ్వు,

మనసులోని భావాలను బయటపెట్టలేని మగువనయ్యాను నేను.

5 comments:

క్రాంతి కుమార్ మలినేని said...

chaala chaala baagundi adiii oka ammayi mansuni ila express cheyyadam inka bagundi

ఉష said...

తెలియనిదేదో తరిచి ఆ తెలుసుకోలేని మనసుకి నేర్పటమే ప్రేమ, ఇరు హృదయాల్లో ఏక సమయాన కలగకపోవచ్చు ఆ భావన, కాని కలిసిన తరవాత అది కమ్మని అమర గానం. వెన్నెల బావుంటుంది, వేకువ బావుంటుంది - ఇది అంతే, వేచివుండటం, ప్రేమించటబడటం...

...Padmarpita... said...

Superb...expressions!!!

Bhavani said...

very nice expressions...deep understanding...smooth flow...keep itup

madhu-anushi said...

వావ్..నిజంగా చాలా అద్భుతంగా రాశారండి.....ఎక్కడో టచ్‌ చేశారు. ఎక్కడికో పంపించేశారు. చివరికి ఏదో రాసేలా చేశారు...నాలో కూడా ఓ కవి ఉన్నాడని గుర్తుచేశారు.

Post a Comment