నా మది నింగిలోని జాబిలి మాయమయ్యింది,

నా ఆనందపు వెన్నెల కరువై చీకటి మిగిలింది,

మన తీపి అనుభూతులు జ్ఞాపకాలుగా మారాయి,

ఆ జ్ఞాపకలు నా హృదయమేఘంలో కలిసిపొయాయి,

నీ జ్ఞాపకాలతో ఆ మేఘం నిండిపొయింది,

ఇప్పుడు నీ చూపుల కాంతులు మెరుస్తున్నాయి,

నీ చిరునవ్వుల చిరుగాలిలా వీస్తునాయి,

ఆ చిరుగాలికి నా హృదయమేఘం కరిగి ఆనంధభాష్పాలు రాల్చింది.

1 comments:

సమిధ ఆన౦ద్ said...

మీ చేత్తో మీరు కురిపించిన వర్షం భలే రసవత్తరంగా ఉంది హనుమంత్ గారు!

Post a Comment