చిన్న చిరునవ్వుతో నీ గుండె చెరలొ బంధించావే,

ప్రేమగా మారి మనసులో చేరకపొయినా,

జ్ఞాపకమై నా గుండెలొ చేరావు,

మౌనన్ని మంత్రంగా వేసి మాయచేసి మరలిపొతున్నావు,

జ్ఞాపకాలను గుండెలో గుచ్చుతూ తియ్యని గాయం చేస్తున్నావు.

నీ మాటలతో మౌనం కరిగేదెప్పుడు,

నీ ప్రేమతో నా గాయం మానేదెప్పుడు.

5 comments:

హరే కృష్ణ . said...

ఇది నిజంగానే నీ జీవితం లో జరిగిందా.. బాగా రాసావ్..అభినందనలు

ఉష said...

జ్ఞాపకాన్నైనా వడిసిపట్టుకోండి. తలపులు వలపులకన్నా పదిలం. వాస్తవానికన్నా వూహలు సుమధురం.

padmarpita said...

బాగుంది మీ ప్రేమ..

hanu said...

పద్మార్పిత గారు మీ స్పందనకు కృతజ్ఞతలు,
హరే కృష గారు ఇది కేవలం ఉహ మాత్రమే, మీ అమూల్యమైన స్పందనకి ధన్యుడిని.
ఉషా గారు మీ బ్లాగు చూసాను చాలా బాగుంది, మీ సలహాని తప్పకుండా పాటిస్తాను, కాని "వాస్తవానికన్న ఉహలు సుమధురం" అన్నది నాకు సబబు కాదేమో అనిపిస్తుంది.చిన్నవాడిని తప్పుంటే క్షమించండి.

నేస్తం said...

తొలిప్రేమ కు ప్రతి హృదయం స్పందించే స్పందన చాలా బాగుంది

Post a Comment