ఓ కవిత్వమా...

పదాలను పువ్వులుగా మార్చి నిన్ను పూజించనా,

మాటలతో మాలలుగా చేసి నీకు అందించనా,

గుండెను ఆభరణంగా చేసి నీకు అలంకరించనా.

నా ఊహల ఊయలలో నిన్ను ఊగించనా,

నా కవితాస్వరాలను కానుకగా నీ పాదాల ముందుంచనా,

భావాలను బంధాలుగా చేసి నీకు బహుకరించనా,

మనసుని మధించి కావ్యపు పన్నీరుతో నీకు అభిషేకం చెయ్యనా.

3 comments:

...Padmarpita... said...

Beautiful kavita...

పరిమళం said...

బావుందండీ ....మీ కవితాభిషేకం ....అదేనండీ మీ కవితావేశం !

raghavendra said...

chala bagundi hanumanth!

Post a Comment