నీ తలపులతో అలలై పారే ఆగని కన్నీళ్ళు,

మనసుని కాల్చేస్తున్న జ్ఞాపకాల జ్వాలలు,

నీ రాక కోసం ఎదురుచూస్తూ నిదుర మరచిన కన్నులు,

నీ తోడులేక నీకై ఒంటరితనపు ఆలోచనలు,

నీవు చేరువవ్వలేదని అనుక్షణం రగిలే మనసు,

ఇవేనా చెలి నీ ప్రేమ కానుకలు.

నీ కన్నులను కాంచిన క్షణం కలలు కరిగిపోతుంటే,

నీ అధారాలను చూసిన తరుణం ఆశలు ఆవిరయ్పోతుంటే,


నీ ఊపిరి తగిలిన సమయం ఊహలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే,


నీవు ఎదుటబడిన నిముషం ఎదలోని భావాలు ఎగిరిపోతుంటే,


నీ చూపులు తాకిన మరుక్షణం మాటలు మాయమవుతుంటే,


మాట చెప్పేదెలా! మనసు తెలిపేదెలా!!


మనసులో కురిసిన తొలకరి స్నేహపు చిరుజల్లువా,

ఎదలో మాటలవెన్నెల కురిపించిన జాబిల్లివా,

ఒంటరి గుండెకు తోడు నిలిచిన స్నేహానివా,

మదిలో మత్తుగా వీచిన సమీరానివా,

మౌనపు గుండెలొ మాటలు జల్లులు కురిపించిన మేఘానివా,

లేక నా చీకటిహృదయం కోరుకునే తోలిసంధ్యవా

ప్రేమను పంచుతుంటే అందుకోనంటున్నావు,

మనసు లేని మానువా ప్రియ నువ్వు,

మనసు నీకు అర్పిస్తానంటే మౌనం వహించావు,

మాటలు రాని,ప్రాణం లేని రాయివా,

చెలి నీ హృదయం ప్రేమజీవం లేని శవమా?

నీ మనసు ప్రేమను పొందలేని శిల్పమా?

లేక నీ కన్నులు కోరుకునే అందం నాలో కనిపించలేదా?

ఐనా అందం కాదు చెలి ఆనందింపజేసేది,

ఐశ్వర్యం కాదు చెలి మనసులు ఐక్యం చేసేది,

ఒక్కసారి నీ మనసుతో నన్ను చూడు,

నా ప్రేమశికరంపై రాణిలా కూర్చున్న నీ రూపం కనబడుతుంది,

ఐనా ఏముందనే అంత పొగరు నీకు,

మట్టిలొ కలిసిపోయే దేహన్ని చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు,

శాస్వతమైనా నా ప్రేమను కాదని?


ఓ కవిత్వమా...

పదాలను పువ్వులుగా మార్చి నిన్ను పూజించనా,

మాటలతో మాలలుగా చేసి నీకు అందించనా,

గుండెను ఆభరణంగా చేసి నీకు అలంకరించనా.

నా ఊహల ఊయలలో నిన్ను ఊగించనా,

నా కవితాస్వరాలను కానుకగా నీ పాదాల ముందుంచనా,

భావాలను బంధాలుగా చేసి నీకు బహుకరించనా,

మనసుని మధించి కావ్యపు పన్నీరుతో నీకు అభిషేకం చెయ్యనా.

వర్షపు చినుకుల జోరుని చూడు,

నీకోసం వేదన చెందే నీలాకాశపు మేఘల కన్నీరు కనబడుతుంది,

మత్తుగా వీచే చిరుగాలిని చూడు,

నిన్ను చేరాలని ఆవేశపడే తీరు కనబడుతుంది,

నా కన్నుల నుండి జారే కన్నిటిని చూడు,

నా గుండెలో నిండిని నీ ప్రేమ కనబడుతుంది.

ప్రకృతి సైతం నీ కన్నుల అందానికి బంధీ కాలేదా,

అటువంటిది ఇక నా మనసెంత?

మనసుకి రెక్కలు వచ్చి ఏనాడో ఎగిరిపొయింది.

నీ రూపన్ని బహుమతిగా ఇచ్చి ఆనాడే వదిలిపొయింది.