ఓ హృదయ మేఘమా, నా మనసు చూడుమా.
నీ ప్రేమ రాల్చుమా, నా ఎదను తడుపుమా.
దాహం తీరక,ఆశలు ఆవిరైపోతున్నాయి.
చూపులు తగలక, కన్నులు చీకటైపోతున్నాయి.
నా గుండెలో తడి నింపుమా, నీ చూపుల వెలుగు పంచుమా.
ఒంటరి కిరణాలలో మాడిపోతున్నా, చల్లగా నీ మాటలు కురిపించుమా.
తొలకరి ప్రేమకై ఎదురుచూస్తున్నా, నా ప్రేమకు జీవం పోయుమా.
ఎదతడికై ఎదురుచూస్తున్నా, కంటతడినే కానుకగా ఇవ్వకుమా.

5 comments:
మీ బ్లాగు ఆహార్యం బావుంది. కవితా హారములతో మరింత శోభించింది.
(పాటల సమూహారం కాదు, సమాహారం. గమనించలేదేమో మీరు.)
నిరాశ వలదు మిత్రమా!
నీ ఆశ తీరును సుమా:)
కంట తడి కానుకగా రాదు నేస్తం..
ఎదనెరిగిన నెచ్చెలి సాన్నిహిత్యంలో..
కంట తడి రాదు నేస్తం..
ఎదనెరిగిన నెచ్చెలి సాన్నిహిత్యంలో..
నీ ఆశలు తీరాలని ఆకాంక్షిస్తున్నా..
mee andarikee inta manchi blog desings elaa dorukutunnayi ? :(. chala bagundi blog background etc.
Post a Comment