బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...
మనకెందుకులే అని బ్రతికేద్దాం.
మానవతను వదిలేద్దాం(1)
మనకెందుకులే అని బ్రతికేద్దాం.
మానవతను వదిలేద్దాం(1)
బ్రతుకు హీనమైపోతున్నా,
భవిత పాడైపోతున్న,
ప్రజలు చచ్చిపోతున్నా,
ప్రగతి పతనమవుతున్నా.
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...(2)
రాష్ట్రం రగిలిపోతున్నా,
బాంబులు పేలిపోతున్నా
హింస రేగిపోతున్నా,
ధరలు మండిపోతున్నా,
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....(3)
సిగ్గులేక బ్రతుకేద్దాం,
గోడమీది పిల్లిలా వ్యవహరిద్దాం.
మార్పు రాలేదని బాధపడదాం.
ఎదుటివారి మీద నిందలేద్దాం.
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....
బ్రతుకలేక బ్రతికేద్దాం.
స్వాతంత్రబానిసలుగా బ్రతికేద్దాం.
6 comments:
బాగా రాశారు
బాగున్నాయండి కవితలు.ఆవును బతికే బతుకు ఎందుకో తెలియకుండా అనుక్షణం చస్తూ తిరిగి బతుకుతు మన గొప్ప మనంఏ తలచుకుంటూ తిరిగి తిరిగి బయలుదేరిన చోటే ఆశల వూపిరి ఆగి పోగా బతికేద్దాం.
బాగున్నదండీ కవిత.
hedding color కొంచెం dark color వాడితే బాగుంటుందేమో!!!
baaguMdi mee aavEdanaa pUrita kavita. nijame oka rakamaina spontaneity ki gurai alaa rolling stone laa batikestunnaam. chempa chellumanipinchela raasaaru.
బాగుంది..
మనందరి ప్రయత్నమే బ్రతుకున మార్చె మార్గం మిత్రమా..
chala bagundi....
Post a Comment