ఆమె ఎదురుపడింది.
గుండె వేగాన్ని పెంచేస్తూ,
కొత్త ప్రపంచానికి స్వాగతిస్తూ.

ఆమె పరిచయమయింది.
గతాన్నంతా చెరిపేస్తూ,
నాలో ప్రేమను గుర్తుచేస్తూ.

ఆమె కలిసిపోయింది.
ఊపిరై మనసులొకి చేరుతూ,
ఊహలై మదిలో తిరుగుతూ.

ఆమె కోపగించుకుంది.
నా ప్రేమను తిరస్కరిస్తూ,
నా మనసుకి గాయంచేస్తూ.

ఆమె వెళ్ళిపోతుంది.
నా ఆనందాలను మూటగట్టేస్తూ,
నా కన్నుల నిండా నీరు నింపేస్తూ.

6 comments:

మధురవాణి said...

ఆమె తిరిగి వస్తుంది.
తనని ప్రాణప్రదంగా ఆరాధిస్తున్న
స్వచ్ఛమైన ప్రేమ విలువ తెలుసుకుని!

:-) :-)

Padmarpita said...

Touching one.

సుజ్జి said...

Hmmm..

sairam said...

మనసుకు హత్తుకునేలా ఉంది..

Unknown said...

keka vundi

battullasridhar said...

same situation

Post a Comment