కనులకిక చీకటే కదా ....
నీ రూపుతోపాటు, నా చూపు దూరమవుతుంటే....

పెదవికిక మౌనమే కదా....
నీ పేరుతోపాటు, నా పలుకు వదిలిపోతుంటే...

మనసుకిక నరకమే కదా...
నీ ప్రేమతోపాటు, నా సంతోషం వెళ్ళిపోతుంటే...

హృదయమిక శిలనే కదా...
నీ స్నేహంతోపాటు, నా జీవం కనుమరుగవుతుంటే...

నాకిక మరణమే కదా....
నీ ఊహతోపాటు, నా ఊపిరి సెలవుతీసుకుంటుంటే...

ఆనందంగా జీవించు చెలి.....

నేనులేని నీ జీవితంలో.... ప్రేమ లేని ఆ ప్రపంచంలో...
సుఖాలను సంతోషాలనుకుంటూ..... ఐశ్వర్యాలను ఆనందాలనుకుంటూ...






నా మాటను మన్నించి ప్రేమ పంచడం నువ్వు ఆపాక,
మనసు పొరలు చీల్చుకుంటూ నా ప్రేమ ఉరకడం మొదలుపెట్టింది.

నిన్ను కాదని దూరంగా తరిమి కొట్టాక,
నాలో దాగి ఉన్న నీ తలపు నా మదిని తట్టిలేపింది.

కనులముందు కానరాకు అని ఈసడించుకున్నాక,
జగాన్ని చీకటి చేస్తూ నీ రూపం కనులను కమ్మేసింది.

నిన్ను చూసే ప్రతిరోజూ నాకొక నరకం అన్న నా హృదయం,
ఈనాడు నీ ఎడబాటులో క్షణమోక నరకంగా మార్చేసింది.

ప్రేమంటే ఇదే అని తెలియని ఆ రోజు నిన్ను దూరం చేసుకున్నాను,
నువ్వే ప్రేమవని తెలిసిన మరుక్షణం నీ ప్రేమ కోసం వెతుకుతున్నాను.

ఎక్కడున్నావో ప్రియా... నీ ప్రేమను చంపేస్తూ........
ఎప్పుడొస్తావో ప్రియా... నా ప్రేమకు ఊపిరిపోస్తూ.......


ఒక స్వప్నం నిజమైన వేళ,
నా కనులను కన్నీరు కప్పేసింది,

ఆ సత్యం నీవైన వేళ,
నా పెదవిని చిరునవ్వు ముంచేసింది.

శాసించే హృదయం కూడ,
నువ్వు శ్వాసించే గాలిలో కలిసిపోయింది.

ఆశించే ఆలోచన కూడ,
నీ ఆనందం కోసం పరితపిస్తుంది.

చివరికి నా అనుకున్న నా జీవితం కూడ,
నాకంటూ ఒక్క నిమిషాన్ని కూడ పంచలేనంటుంది.



నీ కొసం ఎంతగా వెతికాను అంటే,
కరిగే కాలం కన్నీటి ప్రవాహం అయినంత,

నీ గురించి ఎంతగా ఆలొచిస్తున్నాను అంటే,
హృదయపు శబ్ధం కుడా నీ నామం అయినంత.

నీ వెతుకులాటలో ఎంత ప్రేమను నింపుకున్నాను అంటే,
ఆ విరహపు ప్రేమ విలువ కట్టలేని వజ్రం అయినంత.

నీ కోసం ఎంతగా తపించాను అంటే,
ప్రాణంపోతున్నా కూడ చివరి చూపులో నీ రూపన్ని నింపుకుందామని ఎదురుచూసినంత.






మొదటి చూపులోనే కనులలో నిండిన రూపాన్ని మదిలో చేర్చద్దని,
వారిద్దామనుకున్నాను కాని నా ఆలోచనల ముందు ఓడిపోయాను.

గుండెలో రాసుకున్న మాటలన్ని గుట్టుగా దాచుకోకుండా,నీమనసుకి చేరవేద్దమనుకున్నాను,,,
కాని బయటపడనివ్వని నా పెదవి ముందు ఓడిపోయాను.

క్షణానికి ఒకసారన్నా నిన్ను చూడాలని నీ దరిచేరాలని నా మనసు తహతహలాడినా,
రవికాంతిని నింపుకున్న నీ ముఖతేజస్సు చూసే శక్తి నా గుండెకి లేక నీ అందం ముందు ఓడిపోయాను.

నీ మనసులో నేను లేనని తెలిసి, నా మనసులో దాచుకున్న ప్రేమని సమాది చేద్దమనుకున్నా,
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని నా కనుల ముందు ఓడిపోయాను.

మనసుకి తగిలినా గాయాలన్ని తట్టుకుంటూ, తిరిగి నీ ప్రేమకోసం ప్రయత్నిస్తున్నా,
నా ప్రేమను కన్నీరుగా మార్చిన, నీ మనసు ముందు ఓడిపోయాను.

నా ప్రేమను పంచలేక, నీ ప్రేమను పొందలేక, మనసు నిండా నింపుకున్న ప్రేమ,
తుదిశ్వాసతోపాటూ వదిలి వెళ్ళిపోయిన, చివరికి ప్రేమ ముందు కూడా ఓడిపోయాను.




నువ్వు "నన్ను మరిచిపో"మని చెప్పిన.....

కనుల సరస్సులో ప్రేమ ఇంకా ఇంకిపోకుంది,

హృదయ స్పందనలో ప్రేమ ఇంకా ఆగిపోకుంది,

మది గదిలో ప్రేమ ఇంకా ఖాళీకాకుంది,

ఆలోచనని ఆణిచిపెట్టినా, జ్ఞాపకం కరిగిపోనంటుంది.

నీ ఊహలేని క్షణాన్ని కాలం దరిచేరనీయనంది.

ఇంక ఎలా మరి నిన్ను మరిచిపోయేది....?

ఒక్క మాటలో చెప్పనా నా జీవితంలో ప్రతిరోజు....

నిదుర కరిగిన కనులకు మొదటి రూపం, రెప్పవాల్చే కనులలో చేరే చివరి అందం నీ ఆలోచనే.