నువ్వు "నన్ను మరిచిపో"మని చెప్పిన.....

కనుల సరస్సులో ప్రేమ ఇంకా ఇంకిపోకుంది,

హృదయ స్పందనలో ప్రేమ ఇంకా ఆగిపోకుంది,

మది గదిలో ప్రేమ ఇంకా ఖాళీకాకుంది,

ఆలోచనని ఆణిచిపెట్టినా, జ్ఞాపకం కరిగిపోనంటుంది.

నీ ఊహలేని క్షణాన్ని కాలం దరిచేరనీయనంది.

ఇంక ఎలా మరి నిన్ను మరిచిపోయేది....?

ఒక్క మాటలో చెప్పనా నా జీవితంలో ప్రతిరోజు....

నిదుర కరిగిన కనులకు మొదటి రూపం, రెప్పవాల్చే కనులలో చేరే చివరి అందం నీ ఆలోచనే.

6 comments:

కవితాంజలి... said...

చాలా చాలా బావుంది..
నిజం చెప్పాలంటే... ఇది కవితలా అనిపించలేదు నాకు!!

నా మనసులో భావం నేనే పైకి చదివినట్టు అనిపించింది.... :-)

Geetika said...

nice written..

హను said...

thnk u.. kavithanjali nd geethika garu

రాజేశ్వరి నేదునూరి said...

chaalaa baagumdi

sailaja said...

chaalaa baagundi andam kuda takuve

sri said...

last line chala bagundi

Post a Comment