మొదటి చూపులోనే కనులలో నిండిన రూపాన్ని మదిలో చేర్చద్దని,
వారిద్దామనుకున్నాను కాని నా ఆలోచనల ముందు ఓడిపోయాను.

గుండెలో రాసుకున్న మాటలన్ని గుట్టుగా దాచుకోకుండా,నీమనసుకి చేరవేద్దమనుకున్నాను,,,
కాని బయటపడనివ్వని నా పెదవి ముందు ఓడిపోయాను.

క్షణానికి ఒకసారన్నా నిన్ను చూడాలని నీ దరిచేరాలని నా మనసు తహతహలాడినా,
రవికాంతిని నింపుకున్న నీ ముఖతేజస్సు చూసే శక్తి నా గుండెకి లేక నీ అందం ముందు ఓడిపోయాను.

నీ మనసులో నేను లేనని తెలిసి, నా మనసులో దాచుకున్న ప్రేమని సమాది చేద్దమనుకున్నా,
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని నా కనుల ముందు ఓడిపోయాను.

మనసుకి తగిలినా గాయాలన్ని తట్టుకుంటూ, తిరిగి నీ ప్రేమకోసం ప్రయత్నిస్తున్నా,
నా ప్రేమను కన్నీరుగా మార్చిన, నీ మనసు ముందు ఓడిపోయాను.

నా ప్రేమను పంచలేక, నీ ప్రేమను పొందలేక, మనసు నిండా నింపుకున్న ప్రేమ,
తుదిశ్వాసతోపాటూ వదిలి వెళ్ళిపోయిన, చివరికి ప్రేమ ముందు కూడా ఓడిపోయాను.

5 comments:

రాజేశ్వరి నేదునూరి said...

గుండెల్ని పిండే మీ కవితను చదివి ఎం రాయాలో ఎలా రాయాలో తెలియక నేను ఒడి పోయాను

ravali said...

చివరి రెండు లైన్లు చాలండి.... చాలా బాగా చెప్పారు................

sri said...

very nice

Anonymous said...

ణా ఉహలకీ సైతం అందనీ నీ కవీత్వనికీ నన్ను నెన్ను మైమరచీపొయను,,,,,,


sri

Anonymous said...

ణా ఉహలకీ సైతం అందనీ నీ కవీత్వనికీ నన్ను నెన్ను మైమరచీపొయను,,,,,,

Post a Comment