తెలవారుఝామున నీ కనుల గుమ్మం ముందు నిల్చొని
నీకు చిరునవ్వుతొ శుభోదయం తెలుపాలని.

నీవు నడిచే ప్రతిదారిలో నీ పాదాలు కందకుండా
నీకు పూలమార్గం వెయ్యాలని.

నీవు పొందే ప్రతి ఆనందంలో,
నీ చిరునవ్వునై నీ అధరాలపై నిలవాలని.

ఆలోచనలతో అలసిపోయిన నీ మనసుకి,
ఏకాంతంలో నేను జ్ఞాపకం కావాలని.

నా ఆలోచనలు మొదలైన మరుక్షణం,
నీ కనుపాపల నుండి జారే కన్నీరు నవ్వాలని.

అలసిపోయి నిదురించు వేళ,
నీకు ఆనందాలను అందించే కలగా మారాలని.

కనులనిండా కన్నీళ్ళతో,కలల నిండా ఆశలతో ఎదురుచూస్తున్నా,
కనీసం రేపైనా నా యీ భావాలని నీకు తెలుపాలని.

9 comments:

రాజేశ్వరి నేదునూరి said...

చాలా బాగుంది మీ కవిత

చెప్పాలంటే...... said...

chala chalaa baagundi

మనసు పలికే said...

హను గారూ.. ఆ అమ్మాయి ఎవరో కాస్త చెప్పరూ..!! అంత అదృష్టవంతురాలిని గురించి విని కాస్త కుళ్లుకుంటాం.. ;) మీ కవిత చాలా చాలా బాగుంది..:)

అశోక్ పాపాయి said...

super chaala chaala bagundi

Unknown said...

Hi, nice information. i want to share my views which may help many. Where do I begin, I’m about 2 yrs into a marriage life that has had a lot of turbulance due to ED. I cannot make love to my wife or share any intimacy in the bedroom. Anyway all I can say is that I’m trying this new product INVIGO and iam reaching that pleasure. I think there is hope for everyone, Thanks to INVIGO!you can reach this at www.invigo.in

పరిమళం said...

మీ భావాన్ని కవితలో వ్యక్తీకరిచారుగా ...బావుందండీ

Unknown said...

chala bagundi

Suneel Vantaram said...

ఎలా అభినందించాలండి...చాలా బాగుంది.. మీ మనసు చూపించారు..శీర్షిక కరెక్టుగా సరిపోయింది.3,4,5 stanzas ఇంకా బాగున్నాయండి.

kavita said...

మీ కవిత చాల చాల బాగుందండి.

Post a Comment