నా మనసు మధించి నీకు ప్రేమామృతం అందిస్తున్నా ఆస్వాదించలేవు,

నీ చెలిమి నా మనసుకు సంతృప్తి నివ్వడం లేదన్నా అనురాగాన్ని అందించలేవు,

నీ ఏకాంతంలో నా ఆలోచనలకి స్థానం కావాలి అన్న అర్దంచేసుకోలేవు,

నీ మాటలలో మాధుర్యం మనసు పంచేదై ఉండాలన్నా ఆలకించలేవు,

నీ పెదవిపై నవ్వుగా, నీ కనులలో కన్నీరుగా నేను ఉండాలన్నా అంగీకరించలేవు,

ప్రతి క్షణం నీకై, నీడై, నీవై నీతో వుంటాను అన్నా ఆలోచించలేవు,

నీ చేరువలోనే ఈ దూరాన్ని భరించలేనన్నా పట్టించుకోవు,

చివరికి నేను కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నీవేనని తెలుసుకోలేవు.

10 comments:

Pramida said...

touching...

Anonymous said...

బాగుంది. కాని ఆస్వాదించడం అని రాయాలి, ఆశ్వాదించడం కాదు.

కథా మంజరి said...

ఆశ్వాదించ లేవు కాదు. ఆస్వాదించ లేవు అని ఉండాలి.
మీ ప్రయత్నాన్ని హర్షిస్తున్నాను. అభినందనలు. గుడ్ లక్. సాగి పొండి.

Padmarpita said...

చాలాబాగుంది.

మనసు పలికే said...

హను గారూ! చాలా చాలా బాగుందండీ..:)

భావన said...

ఆస్వాదించటం అని వుండాలనుకుంటా. మెలిక "శ" కాదు కుంటి "స"
బాగుంది.

హను said...

పొరపాటును క్షమించగలరు.... మీ అందరి స్పందనకి ధన్యవాదాలు.

భాస్కర రామిరెడ్డి said...

hanu గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు

హారం

Unknown said...

Superb....

..nagarjuna.. said...

ఆస్వాదించలేనివాళ్ళు అర్ధం చేసుకొని అందించగలరా...!!

బాగుంది

Post a Comment