ఆవేదనో తెలియదు..... ఆనందమో తెలియదు......
ఒక్క సారిగా నీవు కనిపించగానే నా కన్నుల్లో కన్నీరు....
ఇన్నాళ్ళ విరహానికి విలువగానో !!
లేక
ఈనాటి కలయికకి కానుక గానో !!
ఒక్క సారిగా నీవు కనిపించగానే నా కన్నుల్లో కన్నీరు....
ఇన్నాళ్ళ విరహానికి విలువగానో !!
లేక
ఈనాటి కలయికకి కానుక గానో !!
బాధో తెలియదు, భారమో తెలియదు.....
నీకు చెప్పుకోలేక నా ప్రేమ పడే బాధ........
మనసులో దాగలేకనో !!
లేక
పెదవి నుండి దాటలేకనో !!
మధురమో తెలియదు, మైకమో తెలియదు......
నువ్వు ప్రేమించావని చెప్పగానే నా గుండె నిండిన అనుభూతి..
నీ మాట చినుకులు నా మనసులో ముత్యాలైనట్లు గానో !
లేక
నీ పెదవిమత్తులో మునిగిన పలుకులతో నా మనసుకి మైకం కమ్మినట్లో !!
నేను నచ్చలేదనో.... నిన్ను మరువలేకనొ....
నన్ను వదిలి నీ మనసులో చేరిపోయింది నా ప్రేమ....
తెలియని ఆనందం నీ మనసులో దొరికిందనో !
లేక
స్వేఛ్చ నిండిన భానిసత్వం నీ గుండెల్లొ నిండి వుందనో !!
8 comments:
//స్వేఛ్చ నిండిన భానిసత్వంతో నీ గుండెల్లొ నిండి వుందనో !!//
చాలా బాగుంది...
బాగా రాశారు!
verY colourful Expressions, brother!
అయ్యయ్యో.. ఇన్ని రోజులూ ఎలా మిస్ అయ్యాను మీ బ్లాగుని..!! చాలా చాలా బాగా రాశారు..:)superb.
ఇంకా అన్నీ చదవలేదు.. 2 టపాలు మాత్రమే చదివాను. అన్నీ చదివి మళ్లీ వ్యాఖ్య పెడతాను..
చాలా బాగు౦ద౦డి గు౦డె అనుభూతి, చదువుతు౦టే ఏదో చెప్పలేని ఆన౦ద౦ గా ఉ౦ది.
ఇన్నాళ్ళ విరహానికి విలువగానో !!
లేక
ఈనాటి కలయికకి కానుక గానో !!
ee lines chala bagunnayi. keep writing
chala baagunnaai anni expressions!
ఆవేదనో తెలియదు..... ఆనందమో తెలియదు......
ఒక్క సారిగా నీవు కనిపించగానే నా కన్నుల్లో కన్నీరు....
ఇన్నాళ్ళ విరహానికి విలువగానో !!
లేక
ఈనాటి కలయికకి కానుక గానో !!
------
ee lines nannu hattukunnayi.. kasepu ekkadiko teesukellayi..
chala bagunnayandi mi kavitalu..
Post a Comment