నా ప్రేమకు ప్రేరణ నువ్వు,

నా గుండెకి ఊపిరి నువ్వు,

ఎదను గెలవాలన్న,

వేదన పెట్టాలన్నా,నీకే సాధ్యం చెలి,

ఎవరో తెలియని నువ్వు,ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు,

ప్రేమ నేరమా మరి,

ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు.

నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,

నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది,

అసలు ఎమిటీ బాధ, గాయం కనబడని బాధ,

మనసుని వేధించే బాధ,

ప్రేమ అంటే బాధేనా,

మనసు మనల్ని మరచి,

మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?

నన్ను నన్నుగా వుండనీయదెందుకు?

నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు?

నీ ఉహలని నా ఊపిరిగా మర్చింది ఎందుకు?

ఏ ప్రశ్నకి సమాధానం తెలియదు,

తెలిసి నువ్వు నాకు చేరువవవు,

ప్రేమ నన్ను వదిలేయి,

తనని నా నుండి దూరం చెయ్యి,

ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి,

ఇక తట్టుకోలేను నన్ను వదిలి వెళ్ళిపో.

నీ ప్రేమ నన్ను ఒంటరిని చేసింది నీ ఆలొచనలతో,

క్షణక్షణం గుండెలో రగిలే అగ్నిజ్వాలలతో నా మనసు మండుతున్నట్లుంది,

నీ చూపులు కరువై నా కన్నులకి అంధకారం అలుముకుంది,

ప్రేమిస్తున్నాననే మాటని పెదవులు నుండి దాటించలేకపోయాను,

నా ప్రేమభావనని నీ మనసులో చేర్చలేకపోయాను,

కాలం నిన్ను నాతో కలుపుతుందనుకున్నాను,

కాని నీ చేతులతో శుభలేఖ అందుకున్న నాకు,

ఒక్కసారిగా గుండెలొ రగిలే అగ్నిపర్వతం పేలింది,

కన్నీటిలావా గుండెలోతుల నుండి బయటకోస్తుంది,

కన్నీటిగోడలతో ఎదురుగావున్న నీ రూపం మసక బారుతుంది,

లోకం మొత్తం చీకటయ్యింది,గుండె వేగం తగ్గుతూవుంది,

శుభలేఖ చేజారింది, తుదిశ్వాసతో గుండె ఆగిపోయింది,

మరణం నాకు చేరువయ్యింది, ప్రేమ నాకు దూరమయ్యింది.

నీ తలపులు తన కోసమే అని తెలుసు,

నీ గుండెలో నిండినది తన ప్రేమేనని తెలుసు,

కాని మనసు మాట విడటం లేదు,

నిన్ను అది మరవటం లేదు,

నీ మనసుని తనకు పంచి తన ప్రేమను స్వీకరించావని తెలిసి కూడ,

నీ మనసు నీ దగ్గర లేదని తెలిసి కూడ ఏదొ గెలవాలని ఆరాటపడుతుంది,

నీ మనసు ఎడారిలో ప్రేమ దాహం తీర్చుకోవాలనుకుంటుంది,

వినవా మనసా తానిక మనకు దక్కదని అంటే,

కనీసం తన ఆనందంలో నన్నా నా ప్రేమను చూసుకుంటానూని అంటుంది,

ప్రేమ దొరకకపొయినా ప్రేయసిని చూస్తూ గడిపేస్తానంటుంది,

కన్నీటి జ్వాలలు మనసుని కాల్చేస్తున్నా ఆనందంగా చిరునవ్వులు చిందిస్తుంది.

కారణాలు తెలియవు నాకు,

నీ కన్నుల కాంతి చూడగానే నా మోముపై ఎందుకు ఆహ్లాదం ప్రకాశిస్తుందో,

నీ చిరునవ్వుల పువ్వులకి నా మనసు ఎందుకు పరిమళిస్తుందో,

మనసెందుకు నిన్ను కోరుకుంటుందో,

కనులెందుకు నిన్ను తన కౌగిలిలొ బంధించాలనుకుంటున్నాయో,

నాలో ప్రతి అణువు నీకోసం ఎందుకు పరితపిస్తున్నాయో,

తెలియని భారమేదో గుండెను బాధపెడుతుందెందుకో,

చెప్పలేను చెలి కారణాలని,

చెరుపలేను సఖి నీ జ్ఞాపకాలని,

ప్రేమించలేను నేస్తమా,

ప్రేమించానని నువ్వు చెప్పినప్పుడు ఏమిచెప్పాలో తెలియలేదు,

స్నేహంగా నిన్ను చూసిన నాకు ఆ భావన కలగలేదు,

నా మౌనం అంగీకారం కాదు నేస్తమా,

నీకు సమాదనం చెప్పే దైర్యం లేక నా మనసు మూగబొయింది,

నేను ప్రేమించలేదని నీకు చెప్పినపుడు నువ్వు పడ్డ బాధ నా మనసుని గాయపరిచింది
.
నా ప్రేమ దొరకక నీ కన్నుల నుండి జారిపడ్డ కన్నీరు ఇంకా తడి ఆరక నా పాదలపై మెరుస్తుంది,

ఎరుపెక్కిన నీ కన్నులలోని రక్తఛార ఇంకా నా కనుపాపల నుండి చెరిగిపోకుంది.

మూగబోయిన నీ స్వరపు మౌనరాగం నా గుండెను గాయం చేస్తుంది,

ఎలా తెలుపను నేస్తమా నా స్నేహభావాన్ని,

ప్రేమను స్వీకరించలేక,స్నేహన్ని దూరం చేసుకోలేక నేను,

స్నేహాన్ని వదులుకోలేక,ప్రేమను పొందలేక నువ్వు,

మౌనపుసంద్రానికి చేరో ఒడ్డున నిలిచిపొయాము.

నేస్తమా ఎలా సమాధాన పరచాలి నిన్ను?

నువ్వు నేనైన నేను, నేను నువ్వైన నీకు,

నన్ను కాగితంగా మార్చి నిన్ను కవితగా చేసి,

రాస్తున్న ప్రేమలేఖ,

నేనైన నీకు నన్ను మరవద్దని,

నిన్ను నువ్వు వదులుకోవద్దని,

నన్ను నీలొ కలుపుకొని నిన్నుగా మార్చిన నన్ను బాధపెట్టొద్దని వేడుకుంటున్నాను.

మొన్న నేను నేనుగా ఉన్నాను,

నిన్న నేను నిన్ను చూసాను,

నన్ను నేను మర్చిపొయాను,

నిన్ను నాలో కలుపుకొని నేను నువ్వుగా మారిపొయాను,

కాని నువ్వు నన్ను నీలో కలుపుకోని నిన్ను నన్నుగా కాకుండ,

నీలాగానే మిగిలిపొయావు,

నిన్ను నువ్వు నీలో నన్ను కలుపుకోని నన్నుగా ఎప్పటికి మార్చుకుంటావు,

ఎప్పటికైనా నువ్వు నేనుగా మారతావని ఎదురుచూస్తూ నువ్వైన నేను.