సముద్రం.... దీనితో నా పరిచయం బహుశా నిన్ను కలిసినాకే మొదలైంది అనుకుంటా....
మన అడుగల ప్రతిరూపాలని తనలో దాచుకునేది...
మన మాటలతో పాటు తన అలలహోరుని జతకలిపేది....
నీ ఎదురుచూపులలో ఒంటరిగా వున్న నాతో తన అలలతో తడుముతూ తోడు నిలిచేది,
నీ రాకని ముందుగానే చల్లని తన చిరుగాలుల ద్వారా నాకు తెలియజేసేది...
మన ప్రేమకు గుర్తుగా అప్పుడప్పుడు తన గుండెలో దాచుకున్న ముత్యాలని కానుకగ ఇచ్చేది,
అస్తమించే సూర్యుని అరుణాన్ని అందంగా అల్లి మన ప్రేమకు బహుమానంగా అందించేది...

ఈ రోజు నువ్వులేవు...నీ మాటలేదు....నీ స్పర్శాలేదు.... నన్ను ఒంటరిని చేసిన నీ జ్ఞాపకాలు తప్ప...
ఆ హోరులేదు..ఆ అలలు లేవు..ఆ అందం లేదు..తీరంలోనే నిలిచిపోయిన నా ఒంటరి అడుగుల గుర్తులు తప్ప...
2 comments:
కవిత వ్రాశాక చిత్రం కోసం వెతికారా లేక చిత్రం చూసి కవిత వ్రాశారా? చిత్రానికి తగ్గ అక్షర రూపం అనిపించింది నాకయితే! బాగుందండీ!
last lines enta baavunnayo
Post a Comment