నిను చూసిన మరుక్షణం నన్ను మరిచి నీవెంట నడిచే సమయాన,
ఈ మనసే నాది, అది వినే మాటే నీది.
కనులకు కమ్మిన నీ రూపం ప్రపంచాన్ని కప్పేస్తుంటే,
నా మనసే ఓ మాయ, నీ మాటే ఓ మంత్రం.
నీను చేరుకోవాలని నీలో కలిసిపోవాలనే ప్రయత్నంలో,
నా మాటే ఓ కెరటం, నీ మనసే నా తీరం.
నా ప్రేమను నీకు తెలియజేసే సమయానా,
నా మనసే ఓ మౌనరాగం, నీ మాటే నాకు అంగీకారభావం.
నీలో ఆ ప్రేమ లేదని తెలిసిన మరుక్షణాన,
నీ మాటే ఆయుధం, నా మనసే మానని గాయం.
అరవిరిసిన చిరునవ్వులు, అలరించిన చెలి చూపులు అబద్ధం అని తెలిసినప్పుడు,
నీ మనసే ఓ మోసం, నా మాటే ఇక మౌనం.

3 comments:
super
ఇన్ని పోస్ట్‌లెప్పుడేశావ్ హను...!
చాలా చాలా బాగా వ్రాస్తున్నావ్.
nice poems..
exlenet
Post a Comment