వర్షపు ఓడిలో,చినుకుల తడిలో,
ఒకటై నడుస్తూ,జతగా తడుస్తూ..
కదిలే గాజుల సవ్వడిలో,రాలే జాజుల ఒరవడిలో.
నా నడక తడబడితే,నువ్వు కనబడక మాయమైతే,
నీవు కానరాక నా కంటతడి,
అల్లంత దూరాన నా కంటపడి.
వర్షాన్ని చీల్చుకుంటూ నీవైపు నా అడుగులూ,
నిను తలచుకుంటూ కనబడని నా కన్నీళ్ళు
నీ చెంత చేరాకా,నా చింత తీరాక.
చినుకులన్నిటిని స్వాగతిస్తూ,నీ చేతికి కానుకిస్తూ.
నీ తోడులో.... వర్షం కురుస్తూ,కాలం కరుగుతూ,
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను.....
(or)
(or)
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ కౌగిలిలో కరిగిపోతు నేను....
(pls select the best one)
మరపుకురాని క్షణాలు,మదిలో మేలిమి జ్ఞాపకాలు.
మరపుకురాని క్షణాలు,మదిలో మేలిమి జ్ఞాపకాలు.
22 comments:
"ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను....."
Is the Best.
మన ఈ కౌగిలి వర్షంలో వాన వెలిశాక కూడ
తీగల అల్లుకుపోయి ఎండిన వీడకుండని
Nice one.
నీ హర్షంలో తడుస్తూ నేను..... baagundandi.
చాలా బాగుంది. రెండు ముగింపులూ బాగున్నాయి. And perfect picture selection! :)
బాగుందండి, ఆర్ద్రంగా ఉంది
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను.....
idi chala bagumdi....
కవిత వ్రాసి పిక్చర్ సెలెక్ట్ చేశావో, పిక్చర్ తీసుకుని కవిత వ్రాశావో కానీ.. రెండూ ఎక్స్‌లెంట్...! బాగున్నాయనడంలో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి.
నైస్ Hanu... వేదన (ఆవేదన)ల్లోంచి హర్షంలోకి ప్రయాణిస్తున్నావ్.
"ఆ వర్షంలో తడుస్తూ నీవు, నీ హర్షంలో మురుస్తూ (or మైమరుస్తూ) నేను ..."
how is it..?
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను.....
నీ హర్షంలో మురుస్తూ (or మైమరుస్తూ) నేను ..."
Good.
hey..nice:)
Hanu గారూ మీ కవిత బాగుందండీ
మధురవాణి గారు చెప్పినట్లు రెండు ముగింపులూ బాగున్నాయి...
నేస్తం !
నీ కవిత చినుకుల్లో తడిసి ముద్దయ్యాను
నీ భావాల చిరు గాలుల్లో తేలితెలి పోయాను
వేదన లో నీ ఆవేదనలో నేనొక చిత్తరువయ్యను
ఇంకేం చెప్పలేక్ ఒక మూగ నయ్యాను !
naakaite "ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను....." chala baaga nachindi!!
Sudheer
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను.....
very beautiful poem. heart touching andi.
thnk u, so much anDi mee andari spamdanaki.
ఎవరివో సజెషన్‍లు వద్దు, మీకు నచ్చినవి మీరు వ్రాయండి.
"ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను....."
baagundandi
"వర్షం" సినిమాను గుర్తుకు తెచ్చారు.verY Nice!
"ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను....."
baagundandi
andariki nachina vakyam..naakoo nachindi..varsham..harsham...photo super...
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను.....
very nice hanuma garu. i dont know how to aprichaite you. am one of the ur biggest fan.
Post a Comment