నిజమే నిన్ను వదిలేసాను....
నా ప్రేమను చంపేసాను...

నా ప్రేమ నిన్ను వేధిస్తుందని,
నా దూరం నిన్ను ఆనందింపచేస్తుందని.....

గతాన్నంతా కాల్చేసాను,
జ్ఞాపకాలన్ని చెరిపేసాను,....

సంవత్సరాలయినట్లుంది నిన్ను చూడక,
ఐనా ఆనందంగానే బ్రతికేస్తున్నాను,.....

యుగాలయినట్లుంది నీ స్వరం వినక,
ఐనా సంతోషంగానే జీవిస్తున్నాను......

కాని కనురెప్పలపై నీ రూపాన్ని చెరిపేయలేకున్నాను,
హృదయస్పందనలో నీ పేరుని మార్చలేకున్నాను.
గుండెలోతునుండి ఉభికి వస్తున్న కన్నీటి ప్రవాహన్ని ఆపలేకున్నాను..

ఐనా సరే నీ ఆనందం కోసం నీకు దూరంగా క్షణక్షణం మరణిస్తూ,
ప్రతి క్షణం (నీవులేని) నాదికాని ఈ  జీవితాన్ని గడిపేస్తాను...





నిజంగా కాలం అన్ని మర్చిపోయేలా చేస్తుంది అని అంటారు అందరు.....

మరి నిన్ను వదిలేసి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా...
ప్రతి క్షణం నీ జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయి ఎందుకు?

నిన్ను మొదటిసారి చూసిన రోజులా,
నీతో మొదటిసారి మాట్లాడిన రోజులా..
నీకు నా ప్రేమను తెలియబరచిన రోజులా...
నువ్వు నా ప్రేమను అంగీకరించిన రోజులా....
నువ్వు నాకోసం పరికిణి వేసుకున్న రోజులా.....
నువ్వు నాకోసం బొట్టు పెట్టుకున్న రోజులా......
నేను నీకు మొదటిసారి ముద్దుపెట్టిన రోజులా.......
నువ్వు నాకు బహుమతి ఇచ్చిన రోజులా........
నువ్వు నాతో మొదటిసారి గొడవపడిన రోజులా.........
నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయిన రోజులా..........
నువ్వు నన్ను జీవితలో నన్ను కలవకు అని చెప్పిన రోజులా...........

ఏదో ఒక రూపంలో.....ఏదో ఒక జ్ఞాపకాలు నిండిన రోజులా.....
ఏదో ఒక సంఘటనతో.... ఈ కాలమే నిన్ను నాకు గుర్తు చేస్తుంది....

నాలో నిండిన నీ ప్రేమను ఇంకా పెంచుతునే వుంది....
నిజంగా నిన్ను గుర్తుచేస్తూ బాదపెడ్తున్న, ఈ కాలమన్న కూడ నాకు కోపం రావడంలేదు...

ఎందుకంటే అది నిన్ను నాకు గుర్తుచేస్తుంది కనుకా...

ఏదో ఒక రోజు ఈ కాలమే మనల్ని కలుపుతుంది అని ఊపిరాగేంత వరకూ ఎదురుచూస్తూ......నీ......






నీకే...చిరునవ్వుల అలలతో నన్ను కవ్విస్తూ, నాకందకుండా మనసుతీరాన్ని తాకేసి వెళ్ళిపోతావు.
నీకోసం నే రాసుకున్న కవితలని, దాచుకున్న ఆనందాలని చెరిపేస్తూ నీతో తీసుకెళ్ళిపోతావు.

కాని నీ ఎడబాటులో తడిసిన ఆ మనసుతీరపు కన్నీటిచెమ్మను మాత్రం అలాగే కానుకగా వదిలేసిపోతావు.

 ఏమనుకుంటున్నావు?,,,,,,,,నన్ను బాధపెట్టాను అని నీలో నువ్వు నవ్వుకుంటున్నావా?
ఒక్కసారి నీ గుండెలోతుల్లొకి వెళ్ళి చూడు నా ప్రతిజ్ఞాపకం ఒక ఆణిముత్యమై నీలో దాగివున్నదో....లేదో?









ఏమైందో ఈ నయనం......
ప్రతిదృశ్యం నీ రూపమైంది......కనుల శిలపై నీ రూపం ఎవరో చెక్కినట్లు....

ఏమైందో ఈ నిమిషం.....
ప్రతిశబ్దం నీ స్వరమైంది....హృదయస్పందన కూడ నీ పేరు పలుకుతున్నట్లు.....

ఏమైందో ఈ తరుణం.....
నాలో ప్రతి అణువు నీవై నిండింది.... ఊపిరి కూడ గుండెకు చేరలేనట్లు....


ఏమైందో ఈ సమయం.....
ప్రతి అడుగు నీ వశమైంది.... ఏదో తెలియని శక్తి నీవైపుకి లాగుతున్నట్లు....


ఏమైందో ఈ హృదయం.....
ప్రతి పదం నిశ్శబ్దమైంది....మనసు వేడెక్కి మాటలు ఆవిరైనట్లు....

ఏమైందో ఈ క్షణం.....
శ్వాసగా మారిన నీ రూపం అదృశ్యమైంది.... క్షణమొక నరకంగా మారుతున్నట్లు....







నిన్ను చూసిన నిమిషాన నా గుండెలో కదలాడే వందల ప్రశ్నలు....

కలలు కనులని దాటి జీవం పోసుకున్నయా?
ఊహలు గుండెను దాటి ఊపిరి పోసుకున్నయా?

నీ పరిచయంలో నా హృదయంలో వేల సందేహాలు....

నా ఆలోచనలు అచ్చుపోసుకొని ఆకారమయ్యయా?
నా అభిరుచులు ప్రాణంపోసుకొని రూపమయ్యయా?

నీ ప్రేమలో నా మనసులో లక్షల ఆనందాలు...

సంతొషాల ప్రవాహాలు నా మదిలో ప్రవహింపజేసావని.
ఆనందాలని ఆయువుగా మార్చి చిన్ని గుండెని బ్రతికిస్తున్నావని

నీ ఎడబాటుతో నా బ్రతుకులో కోటి నరకాలు...

జ్ఞాపకాలు కత్తులై గుండెని కోసినా ప్రాణం పోకుండ గిలగిల కొట్టుకొంటున్నందుకు...
ఆలోచనలు లావాలై హృదయాన్ని దహిస్తున్న మరణం దరిచేరకుండా వెక్కిరిస్తున్నందుకు.






సముద్రం.... దీనితో నా పరిచయం బహుశా నిన్ను కలిసినాకే మొదలైంది అనుకుంటా....

మన అడుగల ప్రతిరూపాలని తనలో దాచుకునేది...
మన మాటలతో పాటు తన అలలహోరుని జతకలిపేది....

నీ ఎదురుచూపులలో ఒంటరిగా వున్న నాతో తన అలలతో తడుముతూ తోడు నిలిచేది,
నీ రాకని ముందుగానే చల్లని తన చిరుగాలుల ద్వారా నాకు తెలియజేసేది...

మన ప్రేమకు గుర్తుగా అప్పుడప్పుడు తన గుండెలో దాచుకున్న ముత్యాలని కానుకగ ఇచ్చేది,
అస్తమించే సూర్యుని అరుణాన్ని అందంగా అల్లి మన ప్రేమకు బహుమానంగా అందించేది...

ఈ రోజు నువ్వులేవు...నీ మాటలేదు....నీ స్పర్శాలేదు.... నన్ను ఒంటరిని చేసిన నీ జ్ఞాపకాలు తప్ప...
ఆ హోరులేదు..ఆ అలలు లేవు..ఆ అందం లేదు..తీరంలోనే నిలిచిపోయిన నా ఒంటరి అడుగుల గుర్తులు తప్ప...