ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధం కావడంలేదు,
నువ్వు పరిచయం అయినప్పుడు.....
నా జీవితంలో ఒక కొత్త వ్యక్తి వచ్చిందని అనుకున్నాను కాని,
నువ్వే నా జీవితం అని అర్ధంచేసుకోలేకపోయాను.
నీ మాటలు ఆలకించానే కాని,
అందులోని మాధుర్యాన్ని ఆశ్వాధించలేకపోయాను,
నీతో గడిన ప్రతిక్షణం ఆనందించానే కాని,
దూరమైతేగాని ఆ క్షణాల విలువ తెలుసుకోలేకపోయాను.
సిగ్గువిడిచి నీ ప్రేమను తెలిపినప్పుడు ఆహ్వానించలేకపోయా కాని,
నీ జ్ఞాపకాలు ఒక్కొక్కటే గుండెను కోసేస్తుంటే ఆపలేకపోతున్నాను.
నువ్వు వదిలివెళ్ళిన కొన్నాళ్ళు మరిచిపోయాననుకున్నాను కాని,
నీవులేని జీవితంలో నన్ను కోల్పోయానని గుర్తించలేకపోయాను.
నలుగురితో వుంటే, నవ్వుతూ వుంటే ఒంటరితనాన్ని,విరహాన్ని అధిగమిస్తాను అనుకున్నాను కాని,
నువ్వు లేకపోతేనే అది ఒంటరితనమని, నువ్వు దూరమైతేనే అది విరహమని గ్రహించలేకపోయాను.
ఈ క్షణం నువ్వు తిరిగిరావాని తెలిసినా, నువ్వు లేని నా జీవితం శూన్యమని తెలిసినా,
నేను పడే ఈ బాధే ప్రేమని, నేను దూరం చేసుకున్న నువ్వే నా ప్రాణమని నీకు చెప్పాలనే నా చివరి కోరిక......

2 comments:
Super expression
విరహానికి దర్పణం మీ భావం...
Post a Comment