ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధం కావడంలేదు,

నువ్వు పరిచయం అయినప్పుడు.....
నా జీవితంలో ఒక కొత్త వ్యక్తి వచ్చిందని అనుకున్నాను కాని,
నువ్వే నా జీవితం అని అర్ధంచేసుకోలేకపోయాను.

నీ మాటలు ఆలకించానే కాని,
అందులోని మాధుర్యాన్ని ఆశ్వాధించలేకపోయాను
,

నీతో గడిన ప్రతిక్షణం ఆనందించానే కాని,
దూరమైతేగాని ఆ క్షణాల విలువ తెలుసుకోలేకపోయాను.

సిగ్గువిడిచి నీ ప్రేమను తెలిపినప్పుడు ఆహ్వానించలేకపోయా కాని,
నీ జ్ఞాపకాలు ఒక్కొక్కటే గుండెను కోసేస్తుంటే ఆపలేకపోతున్నాను
.
నువ్వు వదిలివెళ్ళిన కొన్నాళ్ళు మరిచిపోయాననుకున్నాను కాని,
నీవులేని జీవితంలో నన్ను కోల్పోయానని గుర్తించలేకపోయాను.

నలుగురితో వుంటే, నవ్వుతూ వుంటే ఒంటరితనాన్ని,విరహాన్ని అధిగమిస్తాను అనుకున్నాను కాని,
నువ్వు లేకపోతేనే అది ఒంటరితనమని, నువ్వు దూరమైతేనే అది విరహమని గ్రహించలేకపోయాను.


ఈ క్షణం నువ్వు తిరిగిరావాని తెలిసినా, నువ్వు లేని నా జీవితం శూన్యమని తెలిసినా,
నేను పడే ఈ బాధే ప్రేమని, నేను దూరం చేసుకున్న నువ్వే నా ప్రాణమని నీకు చెప్పాలనే నా చివరి కోరిక...... 

2 comments:

Kishan Gopal said...

Super expression

Ghousuddin Shaik said...

విరహానికి దర్పణం మీ భావం...

Post a Comment