ప్రేమ ఎడారిలో ప్రయాణించాను, నీ చిరునవ్వులని చూసి....
అవి కవ్వించి...మోసంచేసే ఓయాసిస్సులే అని తెలియక.

ప్రతిక్షణం నీకోసం గడిపేశాను నీ ఓరచూపులు చూసి...
అవి మురిపించి...గుండెను కాల్చే జ్వాలలని గుర్తించలేక...

నన్ను విడిచిపోని నీడవని చెబితే ఆనందించాను...
ఆనందపు వెలుగులో తోడుండి...ఒంటరితనపు చీకటిలో విడిచిపోతవని ఆలోచించలేక....

స్వచ్చమైన కన్నీటి లాంటి ప్రేమ నీదంటే పొంగిపోయాను....
గుండెకు చిచ్చుపెట్టి, నేను రోధిస్తుంటే కనులనుండి జారిపోతావని గ్రహించలేక....

నీ గుండెలో చోటిస్తానని నా మనసుని దాచుకున్నావు...
ఇప్పుడు ఊపిరాడనీకుండా బయటపడనీకుండా బంధించి...నవ్వుకుంటున్నావా...

మనసుని......జీవాన్ని.....జీవితాన్ని కోల్పోయిన....నన్ను చూస్తూ.....

1 comments:

Padmarpita said...

చాన్నాళకి మీ మదిభావాల తలుపులు తీసారు.......బాగు బాగు.
Welcome back :-)

Post a Comment