నిన్ను చూసిన నిమిషాన నా గుండెలో కదలాడే వందల ప్రశ్నలు....

కలలు కనులని దాటి జీవం పోసుకున్నయా?
ఊహలు గుండెను దాటి ఊపిరి పోసుకున్నయా?

నీ పరిచయంలో నా హృదయంలో వేల సందేహాలు....

నా ఆలోచనలు అచ్చుపోసుకొని ఆకారమయ్యయా?
నా అభిరుచులు ప్రాణంపోసుకొని రూపమయ్యయా?

నీ ప్రేమలో నా మనసులో లక్షల ఆనందాలు...

సంతొషాల ప్రవాహాలు నా మదిలో ప్రవహింపజేసావని.
ఆనందాలని ఆయువుగా మార్చి చిన్ని గుండెని బ్రతికిస్తున్నావని

నీ ఎడబాటుతో నా బ్రతుకులో కోటి నరకాలు...

జ్ఞాపకాలు కత్తులై గుండెని కోసినా ప్రాణం పోకుండ గిలగిల కొట్టుకొంటున్నందుకు...
ఆలోచనలు లావాలై హృదయాన్ని దహిస్తున్న మరణం దరిచేరకుండా వెక్కిరిస్తున్నందుకు.






సముద్రం.... దీనితో నా పరిచయం బహుశా నిన్ను కలిసినాకే మొదలైంది అనుకుంటా....

మన అడుగల ప్రతిరూపాలని తనలో దాచుకునేది...
మన మాటలతో పాటు తన అలలహోరుని జతకలిపేది....

నీ ఎదురుచూపులలో ఒంటరిగా వున్న నాతో తన అలలతో తడుముతూ తోడు నిలిచేది,
నీ రాకని ముందుగానే చల్లని తన చిరుగాలుల ద్వారా నాకు తెలియజేసేది...

మన ప్రేమకు గుర్తుగా అప్పుడప్పుడు తన గుండెలో దాచుకున్న ముత్యాలని కానుకగ ఇచ్చేది,
అస్తమించే సూర్యుని అరుణాన్ని అందంగా అల్లి మన ప్రేమకు బహుమానంగా అందించేది...

ఈ రోజు నువ్వులేవు...నీ మాటలేదు....నీ స్పర్శాలేదు.... నన్ను ఒంటరిని చేసిన నీ జ్ఞాపకాలు తప్ప...
ఆ హోరులేదు..ఆ అలలు లేవు..ఆ అందం లేదు..తీరంలోనే నిలిచిపోయిన నా ఒంటరి అడుగుల గుర్తులు తప్ప...