మనసు ఉదయంలేని.... చీకటి లోకం.... నిన్ను కలిసేదాక.
అలోచనలు అలుపెరగని అలలు.... నీ పిలుపుల తీరం చేరేదాక.

మొగ్గతోడిగిన పువ్వులా నిన్ను చూసి సిగ్గులొలకపోసే నా మనసు.
తిరుగులేని కిరణంలా నీ మనసుపై ప్రేమను ఎలా ప్రకాశింపచేసిందో....

అంగీకారభావంతో ఈ అరుణోదయాన్ని ఆహ్లాదపరుస్తూ నువ్వొస్తావని ఎదురుచూసూ..
నిన్ను కలిసిన ప్రతిక్షణాన్ని నా మనోజాబిల్లి చుట్టూ చుక్కలుగా పేరుస్తూ..

విసుగు చెందిన ఉదయం కూడ విధిని వదిలి వెళ్ళిపోయింది.
వెలుగు నిండిన ఆశ కూడా కనుల నుండి జారిపోయింది.

కలలు కన్నీళ్ళుగా అలల తోడు చేరి నన్ను ఒంటరిని చేస్తుంటే.
మనసు తనకు ప్రేమను పంచలేకపోయవని ఎగతాళిచేస్తుంటే..

వెళ్ళిపోతున్న ప్రియా నా కలలకు కళ్ళెంవేస్తూ,ఆ అలలకు ఎదురెళ్తూ.
నీ కనుల నుండి దూరంగా... ఈ లోకం నుండి శాస్వతంగా....
 
 
నా గుండెల్లొ దాచుకునే ఆనందాల ఐశ్వర్యం నీ స్నేహం.

నా ఒంటరితనానికి ప్రేమను పంచే అనురాగబంధం నీ స్నేహం.

నా జీవనప్రయాణంలో అలసిపోయి సేదతీరే ప్రతి మజిలి నీ స్నేహం.

బాధలు నిండిన నా చీకటి జీవితంలో ఆనందాల వెన్నెల నీ స్నేహం.

పరిచాయలు ఎన్ని వున్న గుండెలో ప్రతిక్షణం వినిపించే స్పందన నీ స్నేహం.

                          నా ఆలోచనలకు, నా ఇష్టాలకు, నా చిరునవ్వులకు నిలువుటద్దం నీ స్నేహం.

                            ఏకాతంలో జారే కన్నీరు నీ స్నేహం.... బాధల్లో భుజంతట్టే ఓదార్పు నీ స్నేహం..
 
 
 
నిను చూసిన మరుక్షణం నన్ను మరిచి నీవెంట నడిచే సమయాన,
ఈ మనసే నాది, అది వినే మాటే నీది.

కనులకు కమ్మిన నీ రూపం ప్రపంచాన్ని కప్పేస్తుంటే,
నా మనసే ఓ మాయ, నీ మాటే ఓ మంత్రం.

నీను చేరుకోవాలని నీలో కలిసిపోవాలనే ప్రయత్నంలో,
నా మాటే ఓ కెరటం, నీ మనసే నా తీరం.

నా ప్రేమను నీకు తెలియజేసే సమయానా,
నా మనసే ఓ మౌనరాగం, నీ మాటే నాకు అంగీకారభావం.

నీలో ఆ ప్రేమ లేదని తెలిసిన మరుక్షణాన,
నీ మాటే ఆయుధం, నా మనసే మానని గాయం.

అరవిరిసిన చిరునవ్వులు, అలరించిన చెలి చూపులు అబద్ధం అని తెలిసినప్పుడు,
నీ మనసే ఓ మోసం, నా మాటే ఇక మౌనం.