నింగిలోని జాబిలై నీకందనని నవ్వుతుంటే,
నీటినై నీ ప్రతిబింబాన్ని గుండెలో దాచుకుంటూ ఆనందిస్తున్నా.

అందనంత దూరంలో ఒయాసిస్సులా నీవుంటే,
గుండెనిండా ఆశలను నింపుకుంటూ బ్రతికేస్తున్నా.

మనసు నిండ ప్రేమనుంచుకోని కురిపించలేని మేఘంలా నీవుంటే,
నీ జ్ఞాపకాల వేడిలో బీటలుబారిని హృదయంతో ఎదురుచూస్తున్నా.

సంతోషాలన్ని నీలోనింపుకొని సెలయేటిలా ప్రవహిస్తున్నా,
నిలువదని తెలిసినా నా ప్రేమతో ఆనకట్ట వేసి నిన్ను ఆపాలని ఆశిస్తున్నా.


ప్రతిక్షణం నీ విరహం, నీ కోపం  జ్ఞాపకలై నన్ను ఏడిపిస్తున్నా
ఆ జ్ఞాపకం మెదిలిన మరుక్షణం అన్ని మరచి మళ్ళీ నీ ప్రేమకోసం పరితపిస్తున్నా.

13 comments:

చిన్ని said...

చాలబాగుంది

Ramakrishna Reddy Kotla said...

Very nice :)

భాస్కర రామి రెడ్డి said...

చాలా నచ్చిందండి.

శివరంజని said...

మీ కవిత చదువుతుంటే మీరు ఏవరినో మిస్సయారనిపిస్తుంది

పరిమళం said...

"ఆ జ్ఞాపకం మెదిలిన మరుక్షణం అన్ని మరచి మళ్ళీ నీ ప్రేమకోసం పరితపిస్తున్నా"అదేగా మరి ప్రేమంటే !

రాధిక said...

మీ కవితలన్ని చాలా బాగుంటాయండి :-)

ఇవన్ని మీ ప్రేయసి కోసమే రాసినట్టైతే ....ఆ అమ్మాయి చాలా లక్కీ !!

శిశిర said...

బాగుందండి.

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగుందండీ..
మనలో మన మాట..ఎవరా లక్కీ గర్ల్ :-)

నేస్తం said...

నింగిలోని జాబిలై నీకందనని నవ్వుతుంటే,
నీటినై నీ ప్రతిబింబాన్ని గుండెలో దాచుకుంటూ ఆనందిస్తున్నా.

చాలా బాగుందండీ:)

sri said...

toooo good

pavan said...

superb,..... chala bagumdi anDi. nice one

ramnarsimha said...

Chala bagundi..

kiran said...

chala chala bagundi.. :)

Post a Comment