పుడమిని తడిపే స్వాతిచినుకు ఆనందమే,
చెలియ చూపుతో గుండెవణుకు ఆనందమే.

చిమ్మచీకటిలో మేలివెన్నెల అద్భుతమే.
మనసువాకిటిలో చెలివన్నెలు అద్భుతమే.

తడిమితడిపే సంధ్రపు అలలు అమోఘమే,
తట్టిలేపే సఖియ కలలు అమోఘమే.

కనులముందు కరిగిపోతున్న కాలం ఆనంతమే,
మనసులో నిండిపోతున్న కన్నీళ్ళు ఆనంతమే.

సెలయేటిపరవళ్ళకు దిశలన్ని ఆమోదమే.
నా మనసుకి నీ ప్రేమ ఘడియైనా ఆమోదమే.

3 comments:

sphurita mylavarapu said...

Wow భలేవుందండీ.
అన్నట్టు ఎప్పట్నుండో రాయాలని బధ్ధకించేస్తున్నా. మా పిన్ని మీకు ఒక విసనకర్ర. నా బ్లాగు చూడమని link పంపిస్తే లింకుల్లో లింకు పట్టుకుని మీ బ్లాగు పట్టుకుని మీ కవితలన్నీ చదివేసి ఎంతసేపూ మీ కవితల గురించే మాట్లాడుతుంది(నా రాతల గురించి మాట్లాడట్లేదని కొంచెం(చాలా) కుళ్ళుకున్నాననుకోండి :D) మొత్తానికి ఆవిడ ఎన్నాళ్ళుగానో తెలియజెయ్యమంటున్న అభిమానాన్ని ఇవాల్టికి తెలియచేసేసాను.

Anonymous said...

so nice :-)

AKVISHWA said...

బాగుంది నేస్తం...
నా కవిత్వం కంటే...

Post a Comment