కనుల విలువ తెలియదు నీ అందం కనిపించేదాక,

కలల విలువ తెలియదు నీ ప్రతిబింబం చూపించేదాక.

కవిత విలువ తెలియదు నీ ప్రేరణ పొందేదాక,

కన్నీటి విలువ తెలియదు నీ విరహం కాంచేదాక.

అడుగు విలువ తెలియదు నీ తోడులో నడిచేదాక,

అలుక విలువ తెలియదు నీ బుజ్జగింపు తెలిసేదాక.

మధురం విలువ తెలియదు నా హృదయం ప్రేమించేదాక,

అధరం విలువ తెలియదు నీ చుబుకం అందుకునేదాక.

మగువ విలువ తెలియదు మనసు పారేసుకునేదాక,

మనసు విలువ తెలియదు మగువ దోచేసుకొనేదాక.

10 comments:

ramesh said...

మగువ విలువ తెలియదు మనసు పారేసుకునేదాక,
మనసు విలువ తెలియదు మగువ దోచేసుకొనేదాక.

ఈ లైన్లు చాలా బాగున్నాయి.తెలియదు,తెలియదు అంటూనే చాలా చెప్పరు.

nice one

sravan said...

frist two lines,last two lines awsome...

ramya said...

మగువ విలువ తెలియదు మనసు పారేసుకునేదాక,
మనసు విలువ తెలియదు మగువ దోచేసుకొనేదాక.

ee lines chala bagunnayi,totally very nice.

Adviser for Relations said...

its paining

brindhavani said...

చాల బాగుంది

Anonymous said...

చాల బాగుంది

శివ చెరువు said...

Oa whole the flow was nice...

Vebzz said...

mee kavithalo manchi feel undi. chala soft ga touch chesaru.

kallurisailabala said...

అడుగు విలువ తెలియదు నీ తోడులో నడిచేదాక,

అలుక విలువ తెలియదు నీ బుజ్జగింపు తెలిసేదాక.
chala chala nachhindi

రసజ్ఞ said...

బాగుందండీ! చివరగా ఒక్క మాట! మీ బ్లాగ్ విలువ తెలియదు ఒకసారన్నా చదివేదాకా!

Post a Comment